ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్  కబలిస్తున్న విషయం తెలిసిందే. దాదాపుగా అన్ని రాష్ట్రాలలో ఈ మహమ్మారి వైరస్ పంజా విసురుతోంది. ఈ మహమ్మారి వ్యాప్తి చెందటం ఎంతోమందిని భయాందోళనకు గురిచేస్తుంది. ఇంకెంతో మంది కి మృత్యువుతో పోరాడేలా చేస్తుంది ఈ మహమ్మారి. అయితే అటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ రోజురోజుకు దేశంలో కరోనా  వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతునే  ఉన్న విషయం తెలిసిందే. ఏకంగా దేశంలో 20 వేలకు పైగా కరోనా  పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశ ప్రజానీకం మొత్తం భయం గుప్పిట్లో బతుకుతోంది. కరోనా  ఎటు  నుంచి తమ వద్దకు చేరుతుందో  అనే ప్రాణభయంతో బతుకుతున్నారు ప్రజలు. 

 

 

 ఇదిలా ఉంటే తాజాగా కరోనా  వైరస్ కు సంబంధించి ఒక మున్సిపల్ కమిషనర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి . ప్రస్తుతం అధికారి  చేసిన వ్యాఖ్యల గురించి అందరూ చర్చించుకుంటున్నారు. అహ్మదాబాద్లో రోజురోజుకు కరోనా  వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగి పోతున్న విషయం తెలిసిందే. అయితే అహ్మదాబాద్ లో  కరోనా  వైరస్ పాజిటివ్ కేసుల గురించి స్పందించిన నగర మున్సిపల్ కమిషనర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అహ్మదాబాద్లో ప్రస్తుతం ఉన్న ట్రెండ్ మే 31 వరకు కొనసాగితే అహ్మదాబాద్ లో మొత్తం ఎనిమిది లక్షల కేసులు నమోదు అవుతాయి అంటూ మున్సిపల్ కమిషనర్ వ్యాఖ్యానించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. 

 

 

 వివరాల్లోకి వెళితే... అహ్మదాబాద్ మున్సిపల్ కమిషనర్ విజయ్ నెహ్రా  తాజాగా కరోనా  వైరస్ గురించి మీడియాతో మాట్లాడారు. అహ్మదాబాద్లో రోజురోజుకు కరోనా  వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది అంటూ ఆయన వ్యాఖ్యానించారు. కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే అహ్మదాబాద్ లో కరోనా వైరస్ కేసుల సంఖ్య రెట్టింపు అయ్యింది అంటూ ఆయన తెలిపారు. ఒకవేళ అహ్మదాబాద్లో ఇదే ట్రెండ్ కొనసాగితే... మే 15వ  వరకు ఏకంగా అహ్మదాబాద్ జిల్లాలో 50 వేల కరోనా  వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అవుతాయి అని ఆయన తెలిపారు. ఈ లెక్కన చూసుకుంటే మే 31వ తేదీ వరకు కేవలం అహ్మదాబాద్ లోనే  8 లక్షల కరోనా  వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అవ్వడం ఖాయం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మున్సిపల్. 

 

 

 కాగా ఇప్పటివరకు అహ్మదాబాద్ జిల్లాలో పదహారు వందలకుపైగా కరోనా  వైరస్ పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. రికార్డు స్థాయిలో నిన్న ఒక్కటే రోజు 151 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కావడం అక్కడి ప్రజలను మరింత భయకంపితులను చేస్తుంది. అయితే గుజరాత్ రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కరోనా   పాజిటివ్ కేసుల్లో  60 నుంచి 65 శాతం మేర కేసులు కేవలం అహ్మదాబాద్లోని నమోదైనట్లు అక్కడి అధికారులు చెబుతున్నారు. కాగా  మొత్తంగా గుజరాత్ రాష్ట్రంలో 2624 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 112 మహమ్మారి తో జయించలేక మృత్యువాత పడగా..  258 మంది  కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అయితే గురువారం ఒక్కటే రోజు గుజరాత్ రాష్ట్రంలో 217 కరోనా  వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు అక్కడి ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: