ప్రస్తుతం ఏపీ లో నెలకొన్న విపత్కర పరిస్థితులను అధికార పార్టీ వైసీపీ సమర్థవంతంగా వినియోగించుకుని ప్రజల్లో గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తోంది. జగన్ ఎంత ఒత్తిడిలో ఉన్నా, పార్టీకి మేలు జరిగే విధంగా, ప్రభుత్వపరంగా చేయాల్సిన అన్ని కార్యక్రమాలను జగన్ సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, నాయకులు ఇలా అందరిని ప్రజాసేవలో నిత్యం ఉండేలా జగన్ చేయగలుగుతున్నారు. గత నెల రోజులుగా ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఉపాధి కూడా లేదు. అన్ని కార్యాలయాలు మూతపడ్డాయి. అయితే అన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్న ప్రజలకు దగ్గర అయ్యే విధంగా ప్రయత్నాలు మొదలు పెట్టింది. వైసీపీ ఎమ్మెల్యేలు నిత్యం ప్రజల్లో తిరుగుతున్నారు. 

 


వీరితో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే వారు కూడా నిత్యం ప్రజా సేవలో పాల్గొంటూ ప్రజల్లో పలుకుబడి పెంచుకునే పనిలో పడ్డారు. అన్నదానాలు, నిత్యవసర వస్తువుల పంపిణీ ఇలా అన్ని రకాల వస్తువులను పంపిణీ చేస్తూ, ప్రజలకు అండగా నిలబడుతున్నారు. అయితే ఈ సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడా పెద్దగా కనిపించడం లేదు. అధినేత చంద్రబాబు హైదరాబాద్ కే పరిమితం అయిపోవడంతో పార్టీ కేడర్ ను ముందుండి నడిపించే నాయకులు కరువయ్యారు. దీంతో మెజార్టీ టీడీపీ నేతలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. రాష్ట్రస్థాయిలో మంత్రి పదవులు, నామినేటెడ్ పదవులు పొందినవారు, మాజీ ఎమ్మెల్యేలు, ఇలా ఎవరికి వారు తమకు ఎందుకు వచ్చింది లే అన్నట్టుగా దూరం దూరం గా ఉంటున్నారు. 

 


దీంతో కిందిస్థాయి కార్యకర్తలలోనూ నిస్తేజం అలుముకుంది. దీంతో పాటు ఇబ్బడిముబ్బడిగా ప్రభుత్వం తరపు నుంచి అనేక సహాయ సహకారాలు అధికార పార్టీ నాయకులు వాటిని ప్రజల వద్దకు తీసుకు వెళుతూ ప్రజల్లో మంచి పేరు సంపాదిస్తున్నారు. కానీ ఆ అవకాశం టీడీపీ నేతలకు లేకుండా పోయింది. ఎలాగూ ఎన్నికలకు మరో 4 నెలల సమయం ఉండడంతో పెద్దగా ఈ విషయంపై దృష్టి పెట్టడం లేదు. స్థానిక సంస్థల్లో టిడిపి తరఫున బరిలోకి దిగిన అభ్యర్థులు మాత్రమే అక్కడ అక్కడ జనాలను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మిగతా వారంతా పూర్తిగా కాడి వదిలేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: