ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.  దీనితో కేంద్ర ప్రభుత్వం మహమ్మారిని అరికట్టేందుకు మే 3 వరకు లాక్ డౌన్ విధానాన్ని అమల్లోకి తీసుకొని వచ్చారు. ఇక దీనితో ప్రజలు అందరు కూడా ఇళ్లకే పరిమితమయ్యారు అని చెప్పాలి. కానీ ప్రస్తుతం ఈ తరుణంలో ప్రజలలో ఇంకో కొత్త భయం మొదలయింది అనే చెప్పాలి. అది ఏమిటి అన్న విషయానికి వస్తే కుక్కలకు కరుణ వైరస్ వస్తుంది అని ప్రచారం జరుగుతుండగా ప్రజలు అందరు కూడా ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో చాలా మంది ప్రజలు వాళ్ల ఇళ్లల్లో పెంచుకుంటున్న కుక్కలను, పిల్లులను ఇళ్లలో నుంచి బయటకు వదిలి వేయడం జరుగుతుంది. 

 


ఇది ఇలా ఉండగా కరోనా వస్తుందన్న భయంతో పెంపుడు జంతువులను ఇలా వీధి పైకి విడిచిపెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అనేక రాష్ట్రాలు పోలీసులకు పెటా హెచ్చరించడం జరిగింది. అంతేకాకుండా పెంపుడు జంతువులకు ఆహారం ఇచ్చే దుకాణాలు కూడా తెరిచే ఉన్నాయని తెలియజేయడం జరిగింది. ఈ విషయంపై పోలీసుల పెటా విచారణ కూడా జరుపుతున్నారు. పెటా పోలీసులు అనేక రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర పాలిత ప్రాంతాల డైరెక్టర్లకు ఒక లేఖ కూడా రాయడం జరిగింది. ఈ లేఖలో పెంపుడు జంతువులను ఇష్టమొచ్చినట్లు విడిచి పెట్టకూడదు పోలీసులను ఆశ్రయించిన తర్వాతే వదిలి వేయాలని.. లేకపోతే ఇలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలియజేయడం జరిగింది. 

 

 

ఇది ఇలా ఉండగా మరో వైపు కరోనా వైరస్ మనిషి నుంచి మనిషికి మాత్రమే చెందుతుంది కానీ జంతువులకు వచ్చే అవకాశాలు లేవు అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO తెలియజేయడం జరిగింది. ఇప్పటివరకు పెంపుడు జంతువుల ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుంది అన్న విషయానికి ఎటువంటి ఆధారాలు లేవు.. దీనితో జంతువుల పై చర్యలు తీసుకోవడం ఎటువంటి సమన్వయం కాదు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ  తెలియజేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: