భారత దేశంలో చాలా మంది బాబాలు తమదైన మోసాలు చేస్తూ డబ్బు సంపాదించి రాజకీయ పలుకుబడి.. అధికారులను చేతిలో పెట్టుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి.  ఇక గ్రామాలు.. పట్టణాల్లో దొంగ బాబాలకు ఎంతో మంది ఉంటారో లెక్ ఉండదు.  ఇలాంటి బాబాల ద్వారా మోసపోతారని ఎన్ని సార్లు చెప్పినా... భయం భక్తి ఉన్న ప్రజలు ఎవరి మాట వినరు.  గత కొంత కాలంగా దొంగ బాబాలు ఆడవారిపై అఘాయిత్యాలు చేస్తూ అడ్డంగా దొరికిపోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి.  ఈయన గారు సినీ రంగంలో కూడా తనదైన ముద్ర వేశారు. తాను సచ్చీలుగా మసులుకుంటానని, కేవలం వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తానని, జైలులో తన ప్రవర్తన కూడా ఆమోదయోగ్యంగా ఉండడంతో తనకు పెరోల్ ఇవ్వాల్సిందిగా డేరా బాబా దరఖాస్తు చేసుకుంటున్న విషయం తెలిసిందే.

 

 ఇప్పటి  వరకూ తాంత్రిక, మానవాతీత శక్తులు ఉన్నట్టు ప్రచారం చేసుకుని ఓ ప్రత్యేక ప్రపంచాన్ని నిర్మించుకున్న డేరా బాబా మళ్లీ బయటకు వస్తే ఇబ్బందులు తలెత్తుతాయని అధికారులు భావిస్తున్నారు.  తాజాగా డేరా సచ్చా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు మూడు వారాల పాటు పెరోల్ ఇచ్చేందుకు సునారియా జైలు అధికారులు నిరాకరించారు. ఆయనకు పెరోల్ ఇస్తే శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశాలు ఉన్నాయంటూ సిర్సా ఎస్పీ ఇచ్చిన సమాచారం మేరకు జైలు సూపరింటెండెంట్ ఈ నిర్ణయం తీసుకున్నారు.  

 

కాగా, ఇద్దరు సాధ్వీలపై అత్యాచారానికి పాల్పడిన కేసులో ప్రస్తుతం డేరాబాబా రోహ్‌తక్ జిల్లాలోని సునారియా జైల్లో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన తల్లి ఆరోగ్యంపై వైద్య బృందంతో పరిశీలన చేయడంతో పాటు, భద్రతా సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటూ సిర్సా డిప్యూటీ కమిషనర్ చెప్పడంతో జైలు అధికారులు ఆయన పెరోల్ పిటిషన్‌ను పక్కనబెట్టారు. రెండు అత్యాచారాల కేసుల్లో డేరాబాబాను దోషిగా గుర్తిస్తూ పంచకుల కోర్టు 2017 ఆగస్టులో తీర్పు వెలువరించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: