ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ చాపకింద నీరులా విజృంభిస్తుంది. ఇప్పటివరకు కరోనా వైరస్ బారినపడి మన భారతదేశంలో ఏడు వందలకు పైగా మృత్యువాత పడ్డారు. అంతేకాకుండా ఇరవై మూడు వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు  దేశవ్యాప్తంగా నమోదయ్యాయి.ఇక ఈ మహమ్మారిని అరికట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు చేపడుతూనే ఉన్నాయి. అంతేకాకుండా ఈ క్లిష్ట పరిస్థితిలో రాజకీయాలను పక్కన పెట్టి అందరూ కలిసికట్టుగా పని చేయాలి అంటూ.. ప్రధానమంత్రి ఆయా రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా పిలుపునివ్వడం జరిగింది. అంతేకాకుండా ఈ మహమ్మారిపై పోరాటంలో అందరూ కూడా భాగస్వాములు కావాలని కోరడం జరిగింది. ఇది ఇలా ఉండగా మచిలీపట్నం ఎంపీ చేసిన వ్యవహారం మాత్రం చాలా విమర్శలు వచ్చాయనే చెప్పాలి.


ఇక పూర్తి వివరాల్లోకి వెళితే..  కరోనా వైరస్ అరికట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా చర్యలు తీసుకుంటున్నాయి. ఈ తరుణంలోనే వైరస్ పరీక్షలు నిర్వహించేందుకు ల్యాబ్ లను పెంచాలని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అంతే కాకుండా దేశవ్యాప్తంగా ప్రైవేట్ ఆ ల్యాబ్ ల్లో కూడా  పరీక్షలు నిర్వహించాలని అనుమతులు కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ల్యాబ్ లో అన్ని రకాల సదుపాయాలు ఉంటే ఖచ్చితంగా టెస్ట్ లకు అనుమతి ఇవ్వడం ఖాయం. ఈ నేపథ్యంలో ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించడం కోసం హైదరాబాద్ లో ఒక ల్యాబ్ కు అనుమతి ఇవ్వడం జరిగింది. ఇది ఇలా ఉండగా ఆ ల్యాబ్ ఉన్న భవనం వైసీపీ ఎంపీ బాలశౌరి ది కావడం గమనార్హం. ఇది ఇలా ఉండగా ల్యాబ్ పనులు నిర్వహించేటప్పుడు ఎంపీ బాలశౌరీ ఆటంకం కలిగిస్తున్నారని.. అంతే కాకుండా తన భవనాన్ని వెంటనే ల్యాబ్ ను ఖాళీ చేయాలని ల్యాబ్ అధికారులపై ఒత్తిడి చేయడం జరిగింది అని వార్త వినిపించింది. ఇకపోతే దీనిని తప్పుబట్టారు ఏపీ ప్రతిపక్ష, మాజీ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు..

 


ఇక ఈ విషయంపై కరోనా పరీక్షల కోసం ICMR అనుమతి లభించిన ల్యాబ్ పనులను ఒక ఎంపీ ఇలా వేయడం చాలా దారుణమని చంద్రబాబు వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక ఈ విషయంపై ట్విట్టర్ వేదికగా చేసుకొని కరోనా వైరస్ పోరాటంలో ప్రాణాలకు తెగించి వైద్య సిబ్బంది విధులు నిర్వహిస్తూ ఉంటే వాళ్ల మనోధైర్యాన్ని దెబ్బతీస్తున్నారు అంటూ ట్వీట్ చేయడం జరిగింది. ఇది ఇలా ఉండగా చంద్రబాబు చేసిన ట్వీట్.. ఇదే విషయంపై ఒక జాతీయ ఛానల్ కి సంబంధించిన వీడియోలు కూడా చంద్రబాబు జత చేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: