ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న గాని ఎక్కడ సంక్షేమం ఆగిపోకుండా పేదవాడు సమస్యలు పడకుండా జగన్ తెలివిగా డబ్బులను ఖర్చు పెడుతున్నారు. కరోనా వైరస్ తెచ్చిన విపత్తులు ఒకపక్క తట్టుకుంటూనే మరోపక్క  రాష్ట్రంలో ఏ ఒక్కరూ పస్తు ఉండకుండా ప్రతి ఒక్కరిని ఆదుకుంటున్నారు. ఇలాంటి విపత్కర సమయంలో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు రాష్ట్రంలో లేకుండా ఉండటంతో పాటుగా టిడిపి నాయకులు కూడా బయటకు రాని పరిస్థితి ఉండటంతో జగన్ తన ప్లానింగ్ తో టిడిపి పార్టీ నామరూపాలు లేకుండా చేయాలని డిసైడ్ అయినట్లు వైసీపీ పార్టీలో టాక్.

 

ఈ నేపథ్యంలో గ్రామ స్థాయిలో ఉండే గ్రౌండ్ కార్యకర్తల నుండి మంత్రుల వరకు కరోనా విపత్కర సమయంలో ప్రజలకు ఎక్కడ సమస్య ఉంటే అక్కడ వైసీపీ పార్టీ నాయకులు కనబడాలని సూచించారట. అంతేకాకుండా ఎవరైతే స్థానిక ఎన్నికలలో పాల్గొనాలని, పోటీ చేయాలని పార్టీ తరఫున అభ్యర్థులు నిలబడుతున్నారో వాళ్లు… వారి పోటీచేసే స్థానాలలో ప్రజల యొక్క ప్రతి అవసరతను తీర్చే విధంగా సేవా కార్యక్రమాలు చేపట్టాలని వీటిని మంత్రులు పర్యవేక్షిస్తారని జగన్ అదిరిపోయే ప్లాన్ నాయకులకు ఇచ్చారట.

 

దీంతో కష్టకాలంలో ప్రతిపక్ష నేత మరియు కార్యకర్తలు కూడా లేని నేపథ్యంలో ఈ టైం ని వైసీపీకి అదనపు బలమైన టైమింగ్ గా  మలచుకోవాలని నాయకులకు సూచించారట. లాక్ డౌన్ ఏత్తివేసిన స్థానిక ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో వెంటనే కార్యకర్తలు కూడా పార్టీ కోసం బాగా కృషి చేయాలని పిలుపునిచ్చారట. ఈ లోకల్ ఎలక్షన్ తో పూర్తిగా టీడీపీ కేడర్ ని గ్రౌండ్ నుండి తుడిచి పెట్టాలని, ఈ లోకల్ ఎలక్షన్ తో టిడిపికి ఇంకా భవిష్యత్ అనేది లేకుండా చేయాలని జగన్ యొక్క ప్లాన్ అని ఏపీ రాజకీయాలలో టాక్.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: