ఇప్ప‌టికే క‌రోనా వైర‌స్‌తో ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప‌రువు పోగొట్టుకుంటున్న చైనా త‌న పాడు బుద్ధి మాత్రం మానుకోవ‌డం లేదు. ఆ దేశం సృష్టించిన కరోనా వైరస్ ( కోవిడ్ – 19 )తో ప్రపంచ దేశాలన్ని పోరాడుతుంటే చైనా మాత్రం దక్షిణ చైనా వివాదాస్పద సముద్ర ప్రాంతాలపై పట్టు సాధించేందుకు చూస్తోంది. ఇదేదో మ‌నం అంటున్న మాట కాదు...సాక్షాత్తు అగ్రరాజ్యం అమెరికా తెలిపింది. అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పోంపియో ఈ సంచ‌ల‌న ఆరోపణలు చేశారు.

 

 

ద‌క్షిణాసియా దేశాల ప్రతినిధులతో కరోనా నివారణ చర్యలు ఆయా దేశాలలో పరిస్థితుల గురించి తెలుసుకోవడానికి వీడియో కాన్ఫిరెన్స్‌లో మాట్లాడిన పోంపియో  ప్రస్తుతం అన్ని దేశాలు కరోనా వైరస్‌ను కట్టడిచేసే పనిలో బిజీగా ఉండగా చైనా మాత్రం చుట్టు పక్కల దేశాలను తన సైనిక చర్యలతో ఆందోళన కలుగచేస్తుందని అన్నారు. చైనాకు తన చుట్టు ఉన్న దేశాలైన వియత్నాం, తైవాన్, ఫిలిప్పీన్స్ మలేషియా, బ్రూనైలతో సరిహద్దు విబేదాలు ఉండటంతో పాటు ప్రస్తుతం చైనా ఆ ప్రాంతాలపై పట్టు బిగించేందుకు ప్రయత్నిస్తుందని  పోంపియో ఆరోపించారు. దక్షిణ చైనా సముద్రంలోని పలు వివాదాస్పద ద్వీపాలను మరియు అక్కడి సముద్ర ప్రాంతాలను పరిపాలనా జిల్లాలుగా చైనా ప్రకటించిందని తెలిపారు. నెల క్రితం వియాత్నాంకు చెందిన ఫిషింగ్ నౌక అనుమానాస్పదంగా మునిగిపోవడాన్ని ఆయన ప్రస్తావించారు. 

 

ఈ సంద‌ర్భంగా భారత్ విష‌యంలోనూ పోంపియో అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. చైనా తన దక్షిణ చైనా వైపు ఉన్న సముద్ర ప్రాంతాలలోని దీవులను, దిబ్బలను తనవేనని చెప్తుంది.  అయితే చైనా చర్యలపై భారతదేశం నుంచి ఎలాంటి స్పందన రాలేదని పోంపియో అన్నారు. ఎందుకంటే భారత దేశంలోని 55శాతం వాణిజ్యం దక్షిణ చైనా సముద్ర బాగంలోని మలక్కా సంధిగుండా వెళ్తుంది. ఇదివరకే ఈ ప్రాంతంలో ఉద్రిక్తలకు దారితీసే ఏచర్యలను కూడా ఉపేక్షించమని భారత్ తెలిపింది. అయితే, ఇప్ప‌టికీ చైనా త‌న బుద్ధి మార్చుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: