ఏపీలో కరోనాపై రాజకీయం ఓ రేంజ్ లో జరుగుతున్న విషయం తెలిసిందే. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం రోజురోజుకూ పెరిగిపోతుంది. అయితే ఈ మాటల యుద్ధం కాస్త వ్యక్తిగత విమర్శలకు దారితీస్తుంది. విమర్శల స్థాయి దాటేసి వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. ఇలా వ్యక్తిగత దూషణలు చేయడంలో మాత్రం కాస్త వైసీపీనే పైచేయి సాధిస్తున్నట్లు కనిపిస్తోంది.

 

కాకపోతే ఈ కరోనా ప్రభావం ఏపీలో మొదలు కాగానే, టీడీపీ నేతలు జగన్ ప్రభుత్వం లక్ష్యంగా విమర్సలు చేయడం మొదలుపెట్టారు. హైదరాబాద్ లో ఉన్న చంద్రబాబు ఏదొకవిధంగా జగన్ ప్రభుత్వంపై విమర్సలు చేస్తూనే ఉన్నారు. ఏదో సలహాలు ఇస్తున్నట్లు ఇచ్చి  జగన్ ప్రభుత్వంపై బురద జల్లేస్తున్నారు. ఇక బాబుతో పాటు మిగిలిన టీడీపీ నేతలు కూడా వరుస పెట్టి, జగన్ ప్రభుత్వం కరోనా కట్టడి చేయడంలో ఫెయిల్ అయిందని చెబుతూ ఓ విష ప్రచారం చేస్తున్నారు.

 

అయితే టీడీపీ నేతలు విమర్సలు పెద్దగా వ్యక్తిగతంగా లేవు. కానీ వైసీపీ నేతలు మాత్రం మరీ వ్యక్తిగతంగా విమర్సలు  చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇదే విషయాన్ని తెలుగు తమ్ముళ్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి మరీ వైసీపీ నేతలు మాట్లాడుతున్న లాంగ్వేజ్ పై విమర్సలు చేస్తున్నారు. తమ నేతలు సాధారణ విమర్శలు చేస్తుంటే, వైసీపీ వాళ్ళు మాత్రం వ్యక్తిగత దూషణలు చేస్తున్నారని అంటున్నారు. అసలు  విజయసాయిరెడ్డి లాంటి వారు అయితే దారుణంగా ఉన్నారని, ఇంకా ఎమ్మెల్యేలు, మంత్రులు చాలా దారుణంగా విమర్శిస్తున్నారని చెబుతున్నారు.

 

తాజాగా అయితే ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, నారా లోకేష్ ని ఉద్దేశించి, ఆంబోతు అని అనడం ఎంతవరకు సమంజసమని అంటున్నారు. ఇలా మాట్లాడటం వల్ల టీడీపీకి డ్యామేజ్ జరగడం కంటే, వైసీపీకే ఎక్కువ నష్టం జరుగుతుందని, చివరికి టీడీపీకే ప్లస్ అవుతుందని, ప్రజలు ఇలాంటి భాషని ఒప్పుకోరని, కాబట్టి ఇకనుంచైనా వ్యక్తిగత దూషణలకు దిగకుండా ఉంటే బెటర్ అని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: