జగన్ ఎన్ని మంచి పనులు చేసిన అందులో చెడు వెతకడం టీడీపీకి చెల్లు అనే విషయం మరోసారి రుజువైంది. అసలు జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి, ఆయన ఎలాంటి పథకం అమలు చేసిన, దానిపై టీడీపీ విమర్సలు చేస్తూనే వచ్చింది. ఆ పథకం వల్ల ప్రజలకు చాలా ఉపయోగం జరిగిన కూడా, బాబు అండ్ బ్యాచ్ కు విమర్సలు చేయడమే పని.

 

ఈ క్రమంలోనే తాజాగా సీఎం జగన్, దాదాపు 80 లక్షల మంది మహిళలకు ఉపయోగపడేలా సున్నా వడ్డీ పథకాన్ని తీసుకొచ్చారు. 1400 కోట్లు దీనికి కేటాయించారు. ప్రస్తుతం కరోనా వల్ల రాష్ట్రం ఎన్ని ఇబ్బందుల్లో ఉందో తెలిసిందే. లాక్ డౌన్ వల్ల ఎక్కడవి అక్కడ బంద్ అయిపోయాయి. ఆదాయం వచ్చే మార్గాలు కూడా మూసుకుపోయాయి. ఎన్ని ఇబ్బందులు ఉన్న కానీ జగన్ ప్రజలకు ఎలాంటి లోటు చేయడం లేదు.

 

పథకాలు అన్ని సక్రమంగా అందిస్తున్నారు. ఇంకా అదనంగా రూ. వెయ్యి, ఉచిత రేషన్ కూడా ఇచ్చారు. ఇక ఇప్పుడు మహిళల కోసం సున్నా వడ్డీ తీసుకొచ్చారు. అయితే ఇలాంటి సమయంలో ప్రజల కోసం తీసుకొచ్చిన ఈ పథకంపై టీడీపీ నేతలు విమర్సలు చేస్తున్నారు. ప్రజలని మోస చేయడానికే జగన్ ఈ పథకం తీసుకొచ్చారని, ఎన్నిక ల్లో ఇచ్చిన హామీలని మరిచిపోయేందుకు సున్నా వడ్డీని తెరపైకి తీసుకొచ్చారని అంటున్నారు.

 

అలాగే ఈపథకం తమ ప్రభుత్వ హయాంలో అమలైందని, ఇప్పుడు ఆ పథకాన్ని కాపీ కొట్టి అమలు చేస్తున్నారని చెబుతున్నారు. అసలు చంద్రబాబు హయాంలో ఈ పథకం ఏదో పేరుకు అమలైంది. కానీ దీని వల్ల పెద్దగా మహిళలు లబ్దిపొందలేదు. పైగా 2016 లోనే పథకం ఆగిపోయింది. ఇక మొదట దివంగత వైఎస్సార్ పావలా వడ్డీకి రుణాలు ఇచ్చారు. ఆయన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో సున్నా వడ్డీ పథకం వచ్చింది. ఆ పథకం చంద్రబాబు ప్రభుత్వం హయాంలో కూడా కొనసాగింది. కానీ పూర్తిగా పథకం అమలు కాలేదు.

 

ఇక ఇప్పుడు జగన్ పూర్తిగా పథకాన్ని అమలు చేయడానికి సిద్ధమయ్యారు. అయితే ఈ విషయాలన్నీ ప్రజలకు పూర్తిగా తెలుసు. కానీ అవేమి పట్టించుకోకుండా టీడీపీ నేతలు ఓ వైపు పథకం మాదే అని చెబుతూ,  మరోవైపు ఈ పథకాన్ని అడ్డం పెట్టుకుని జగన్ ప్రజలని మోసం చేస్తున్నారంటూ అర్థంపర్ధం లేని కామెంట్లు చేస్తున్నారు. ఇలా మాట్లాడితే ప్రజలు అసహ్యించుకుంటారనే విషయం కూడా టీడీపీ నేతలకు అర్ధం కావడం లేదనుకుంటా.

మరింత సమాచారం తెలుసుకోండి: