ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి వైయస్ జగన్ కరోనా వైరస్ విపత్కర సమయంలో కూడా దూసుకుపోతున్నారు. విభజనతో ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నష్టపోయి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో వైరస్ వల్ల మరిన్ని సమస్యలు వచ్చినా కానీ జగన్ వెనకడుగు వేయటం లేదు. తనపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని ఎక్కడ వమ్ము కాకుండా అద్భుతంగా పరిపాలిస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో మరియు పాదయాత్రలో ప్రజలకు మాట ఇచ్చిన ‘సున్నా వడ్డీ పథకాన్ని’ తాజాగా ప్రారంభించడం జరిగింది. ఇలాంటి విపత్కర సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అక్క చెల్లెళ్లకు ఆదుకునే విధంగా ‘వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకాన్ని’ ప్రారంభిస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు.

 

 

పరిస్థితి ఎంత దారుణంగా ఉన్న జగన్ తన మాటను నిలబెట్టుకోవడంలో ఏపీ మహిళా లోకం సంతోషం వ్యక్తం చేసింది. అయితే ఇలాంటి విపత్కరమైన క్లిష్టమైన ఆర్థిక ఇబ్బందులు ఉంటున్న సమయంలో జగన్ ఏకంగా 1400 కోట్లు ఈ పథకానికి కేటాయించడంతో ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయ్యింది.

 

చాలామంది గత సార్వత్రిక ఎన్నికల టైంలో చంద్రబాబుని ఇచ్చిన మాట నిలబెట్టుకో పోవడంతో ప్రజలు ఇంటికి పంపించారని..దాన్ని చూసి జగన్ నేర్చుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతిపక్షానికి చాన్స్ ఇవ్వకుండా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడానికి ముందుకు వెళ్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఏది ఏమైనా చంద్రబాబు లాగా తన రాజకీయ కెరియర్ అవ్వ కూడదని ఇచ్చిన ప్రతి వాగ్ధానాన్ని నెరవేర్చడంలో జగన్ మంచి పాఠం గత ప్రభుత్వం నుండి నేర్చుకున్నట్లు అర్థమవుతుంది. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple.

మరింత సమాచారం తెలుసుకోండి: