మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌, ఏపీ సీఎం జగన్ పరోక్ష యుద్ధం ఇప్పుడు మరో కొత్త మలుపు తిరిగింది. నిమ్మగడ్డను పదవి నుంచి తొలగించడంతో ఈ యుద్ధం దాదాపు ముగిసిందని అంతా అనుకున్నారు. కానీ విజయసాయిరెడ్డి అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చి.. నిమ్మగడ్డ కేంద్రానికి రాసిన లేఖపై దర్యాప్తు చేయాలంటీ డీజీపీకి ఫిర్యాదు చేయడంతో ఈ వివాదం కొత్త మలుపు తిరిగింది.

 

 

విజయసాయిరెడ్డి ఫిర్యాదు మేరకు ఈ లేఖపై దర్యాప్తు ప్రారంభించిన సీఐడీ అధికారులు ఈ కేసులో మంచి పురోగతి సాధించినట్టు తెలుస్తోంది. అసలు నిమ్మగడ్డ ఈ లేఖను కేంద్రానికి రాసినప్పుడే ఇది చాలా వివాదాస్పదం అయ్యింది. లేఖ ఓ ఎన్నికల కమిషనర్ రాసినట్టుగా లేకుండా...ఓ ప్రతిపక్షనేత ప్రభుత్వంపై అక్కసు రాసినట్టు స్పష్టంగా అర్థమైపోయింది. దీనికి తోడు ఈ లేఖ విషయం పత్రికల్లో ప్రముఖంగా వచ్చినా దానిపై నిమ్మగడ్డ ఏమాత్రం స్పందించలేదు.పైగా ఆ లేఖతో తనకు సంబంధం లేదని ఓ వార్త సంస్థకు చెప్పారు కూడా.

 

 

అయితే విజయసాయి ఫిర్యాదుతో నిమ్మగడ్డ కూడా స్పందించాల్సి వచ్చింది. లేఖ తాను రాసిందేనని దీనిపై ఎవరికీ అనుమానాలు అక్కర్లేదని నిమ్మగడ్డ ఓ ప్రకటనలో తెలిపారు. అయితే ఈ లేఖ కచ్చితంగా టీడీపీ కార్యాలయం నుంచే వచ్చిందని వైసీపీ నమ్ముతోంది.అందుకే ఇప్పుడు సీఐడీ విచారణ కూడా ఆదిశగానే సాగుతోంది. ఈ విచారణలో అనేక షాకింగ్ విషయాలు ఇప్పుడు వెలుగు చూస్తున్నాయి.

 

 

అవేంటంటే.. లేఖ నిమ్మగడ్డ స్వయంగా తయారు చేయలేదట. లేఖ బయటి నుంచి నిమ్మగడ్డ ఓ పెన్ డ్రైవ్ లో తెచ్చుకున్నారట. దాన్ని డౌన్ లోడ్ చేసుకుని సంతకం చేసి ఆ తర్వాత కేంద్రానికి పంపించారట. ఆ తర్వాత ఆ పెన్ డ్రైవ్ ను ధ్వంసం చేశారట. అంతే కాదు.. ఆ ల్యాప్ టాప్ ను రెండు సార్లు ఫార్మాట్ కూడా చేశారట. ఈ సంచలన విషయాలను సీఐడీ బయటపెడుతోంది. అంటే.. నిమ్మగడ్డ వైసీపీ ఆరోపించినట్టు టీడీపీతో కుమ్మక్కయ్యే కేంద్రానికి ఈ లేఖ రాసి ఉంటారన్న అభిప్రాయం కలుగుతోంది. మరి విచారణ పూర్తయితే కానీ దీనిపై ఓ క్లారిటీ రాదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: