ఇండియాలో లాక్ డౌన్ తీసేస్తే పరిస్థితి దారుణంగా ఉంటుందని పలు సర్వేలు హెచ్చరిస్తున్నాయి. ప్రస్తుతం నేషన్ వైడ్ గా మే 3 వరకు లాక్ డౌన్ కొనసాగనున్న సంగతి తెలిసిందే. అయితే లాక్ డౌన్ అమలు లో వున్న కూడా రోజుకు 1000కి పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇక లాక్ డౌన్ ఇంకో 8 రోజులు కొనసాగనుంది. ఆలోగా కరోనా కట్టడి కావడం అసాధ్యం. అయినా కూడా ఒకేవేళ లాక్ డౌన్ ఎత్తేస్తే కనుక మే 19నాటికి దేశంలో 38,220 కరోనా మరణాలు సంభవిస్తాయని అలాగే 5.35లక్షల పాజిటివ్ కేసులు నమోదు కావొచ్చని జవహర్‌లాల్‌ నెహ్రూ సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ సైంటిఫిక్‌ రీసెర్చ్‌(జేఎన్‌సీఏఎ్‌సఆర్‌), బెంగళూరు ఐఐఎస్‌, ఐఐటీ బాంబే సంస్థలు పేర్కొన్నాయి. 
 
అయితే అన్ని సర్వేలను నమ్మాల్సిన అవసరం లేదు కానీ ప్రస్తుతం నమోదవుతున్న కేసుల సంఖ్య చూస్తే మాత్రం మే మధ్యలో కరోనా తీవ్ర రూపం దాల్చే అవకాశం లేకపోలేదు.  ఇక ఈనెల 27న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ లాక్ డౌన్ పై చర్చ జరుపనున్నారు. ఆరోజు లాక్ డౌన్ పొడిగించే విషయంలో ఓ క్లారిటీ వచ్చే అవకాశం వుంది. అయితే దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ను కొనసాగిస్తూ సడలింపుల విషయంలో రాష్ట్రాలకు పూర్తి స్వేచ్ఛ నిస్తే ఉపయోగం ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 
ఇక నిన్నటి వరకు దేశ వ్యాప్తంగా 24000 కరోనా కేసులు నమోదు కాగా 750 మంది మరణించారు. ప్రధానంగా మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, మధ్యప్రదేశ్ లలో ఎక్కువగా కేసులు నమోదువుతున్నాయి. సౌత్ లో మాత్రం కేరళ, తెలంగాణ, కర్ణాటక లో కేసులు తగ్గుముఖం పట్టగా తమిళనాడు ,ఆంధ్రప్రదేశ్ లలో ఎక్కుగా కరోనా కేసులు నమోదువుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: