భారత్ లో కరోనా కట్టడి కోసం దేశమంతా లాక్‌ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే లాక్ డౌన్ విధించి నెల రోజులు దాటి పోయింది. అంతే కాదు.. ఇంకా లాక్ డౌన్ పొడిగించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే మోడీ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంపై మొదట్లో విమర్శలు వచ్చాయి. దేశ ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతుందన్నారు. అమెరికా వంటి దేశాలు లాక్ డౌన్ దీనికి పరిష్కారం కాదన్నాయి.

 

 

ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ విషయంలో భిన్నాభిప్రాయం వ్యక్తం చేసింది. అయినా మోడీ సర్కారు లాక్ డౌన్ వైపే మొగ్గారు. ఏకంగా నెల రోజుల పాటు దేశం స్థంబించి పోయిందనే చెప్పాలి. అయితే ఇప్పుడు మోడీ చేసిన పని చాలా గొప్ప పని అన్న విషయం రుజువవుతోంది. ఎందుకంటే.. భారత్ లో లాక్ డౌన్ సత్పలితాలను ఇస్తోందని సాక్ష్యాలు కనిపిస్తున్నాయి.

 

 

ప్రస్తుతం ఇండియాలో పది రోజులకు ఒకసారి కేసులు రెట్టింపు అవుతున్నాయి. అదే లాక్ డౌన్ లేకుండా ఉంటే ఈపాటికి దేశ వ్యాప్తంగా 73 వేల కేసులు నమోదయ్యేవని నీతి అయోగ్ ప్రకటించింది. ప్రస్తుతం భారత్ లో కరోనా కేసులు 23వేలు గా ఉన్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 1684 కరోనా పాజిటివ్ కేసులు దేశవ్యాప్తంగా నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 23,077కి చేరింది. ఇప్పటి వరకూ 4748 మంది కోలుకున్నారు.

 

 

మొదట్లో లాక్ డౌన్ పట్ల ఉదాశీనంగా ఉన్న అమెరికా ఇప్పుడు తగిన మూల్యం చెల్లించుకుంటోంది. ఆ దేశంలో మన కంటే ఆలస్యంగా కరోనా విజృంభణ మొదలైంది.కానీ రోజుల వ్యవధిలోనే కేసుల రెట్టింపవుతూ వచ్చాయి. ఇప్పుడు ఏకంగా లక్షల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. ఏకంగా అర లక్ష మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ ఇండియాలో కేసులు తగ్గుతున్నాయి. గడిచిన 14 రోజుల్లో 80 జిల్లాల్లో కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాలేదు. 28 రోజులుగా 15 జిల్లాల్లో ఒక్క కేసు కూడా రాలేదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: