దేశంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ప్రతిరోజూ వందల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. దేశంలో కరోనా బాధితుల సంఖ్య 23,450కు చేరగా 4,814 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు తలనొప్పి, గొంతు నొప్పి, శ్వాస సంబంధిత సమస్యలు మాత్రమే కరోనా లక్షణాల్లో కనిపించాయి. అయితే వైద్యుల పరిశోధనల్లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 
 
అయితే తాజాగా వైద్యులు చర్మంపై దద్దుర్లు ఉన్నా కరోనా సోకినట్లే అని చెబుతున్నారు. ఇటలీకి చెందిన వైద్యులు చేసిన పరిశోధనల్లో కరోనా రోగుల్లో చర్మ సంబంధిత సమస్యలు ఉన్నట్టు గుర్తించారు. కరోనా సోకిన వారిలో ఎర్రటి దద్దుర్లు వస్తున్నట్టు తాము గుర్తించామని అన్నారు. దీనికి సంబంధించిన మరిన్ని పరీక్షలు జరపాల్సి ఉందని వారు తెలిపారు. వైద్యులు దద్దుర్లకు సంబంధించిన మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉందని అన్నారు. 
 
డాక్టర్ మాయా వేదమూర్తి మీడియాతో మాట్లాడుతూ ఎవరిలోనైనా కరోనా లక్షణాలు కనిపించకుండా చర్మంపై దద్దుర్లు వస్తే కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కరోనా లక్షణాలు అందరిలో ఒకే విధంగా ఉండడం లేదని ఒక్కోక్కరిలో ఒక్కో విధమైన లక్షణాలు కనిపిస్తున్నాయని వారు తెలిపారు. ఇటలీతో పాటు ఇతర దేశాల్లోని డాక్టర్లు సైతం కరోనా రోగుల్లో ఎర్రటి దద్దుర్లు గుర్తించామని అన్నారు. 
 
పలు దేశాల్లో శాస్త్రవేత్తలు కరోనా బాధితుల్లో దద్దుర్ల గురించి పరిశోధనలు జరుపుతున్నాయి. కరోనా బాధితుల్లో ఎక్కువగా కాలిపై దద్దుర్లు వస్తున్నట్టు తాము గుర్తించామని తెలిపారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తెలంగాణలో నిన్నటివరకు 983 కరోనా కేసులు నమోదు కాగా ఏపీలో 955 కేసులు నమోదయ్యాయి. ఇరు రాష్ట్రాల్లో దాదాపు కరోనా కేసులు నమోదు కావడం గమనార్హం. ఇరు రాష్ట్రాల సీఎంలు కొత్త కేసులు నమోదు కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: