కరోనా  వైరస్ ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దాదాపుగా అన్ని దేశాలలో లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. అయితే కరోనా  వైరస్ కారణంగా ప్రపంచం మొత్తం స్తంభించి పోతుంది. ఇక అందరి కార్యకలాపాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఎన్నో శుభకార్యాలు వాయిదా పడ్డాయి. కానీ ఈ మహమ్మారి వైరస్ పెళ్లిళ్లు మాత్రం అడ్డుకోలేక పోతుంది. ఓవైపు ప్రపంచ మహమ్మారి కలవరపడుతున్నపటికీ పెళ్లిళ్లు మాత్రం జరిగిపోతున్నాయి. ఎన్నో జంటలు ఒక్కటి  అవుతున్నాయి. అదేంటోగాని కరోనా  వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న ముహూర్తమే మంచి ముహూర్తం అనుకున్నారో ఏమో... చాలా జంటలు పెళ్లిళ్లు చేసుకోవడానికి ముందుకు వస్తున్నాయి. 

 

 

 అయితే కరోనా వైరస్ విజృంభన నేపథ్యంలో ఎక్కడ శుభకార్యాలు పెళ్ళిళ్ళు జరుపుకో వద్దు అంటూ ఆయా  ప్రభుత్వాలు సూచిస్తున్న విషయం తెలిసిందే. దీంతో అన్ని డిజిటల్ పెళ్లిళ్లు గా మారిపోతున్నాయి. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నే పెళ్లిళ్లు జరుపుకుంటున్నారు. పెద్దలు కూడా ఇలాగే ఆశీర్వాదాలు ఇస్తున్నారు. తాజాగా ఇలాంటి పెళ్లి ఒకటి జరిగింది. సుషేన్ దంగ్,  కీర్తి నారాంగ్  అనే ఇద్దరికీ గతం లో పెళ్ళి నిశ్చయమైంది. వీరిద్దరూ బంధు మిత్రులు కుటుంబ సభ్యుల మధ్య ఎంతో అంగరంగ వైభవంగా పెళ్ళి చేసుకోవాలని భావించారు. కానీ ఇంతలో కరోనా  వైరస్ విజృంభించడం తో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగింది. లాక్ డౌన్ ఉంటే ఏంటి పెళ్లి చేసుకోకుండా ఉండాలా అని అనుకున్నారో ఏమో... ఈ జంట వీడియో కాల్ ద్వారా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీనికోసం వీడియో కాన్ఫరెన్స్ యాప్ జూమ్ ఎంచుకున్నారు ఈ జంట. 

 

 

 సుశీల్ ముంబైలో పెళ్లి కోసం తెచ్చుకున్న  సంప్రదాయ దుస్తులు ధరించి పెళ్లి కొడుకుల ముస్తాబయ్యాడు. అదే సమయంలో బరేలిలో  వధువు కూడా పెళ్లికూతురులా  ముస్తాబు అయిపోయింది. ఇక వధువు తండ్రి కూడా ఆన్లైన్లోనే కన్యాదానం చేయడం గమనార్హం. ఇక ఈ పెళ్లికి పురోహితుడు కూడా ఉన్నాడండోయ్ . రాయపూర్ కు చెందిన పురోహితుడు ఆన్లైన్లోనే మంత్రాలు చదువుతూ పెళ్లి తుంతు కానిచ్చేసాడు . మరి ఈ పెళ్లికి బంధువులు హాజరయ్యారా  అంటే ఎందకు అవ్వలేదు... భారీగా బంధువులు వీడియో కాన్ఫరెన్స్ లోకి వచ్చేశారు. ఇప్పటికే పలు డిజిటల్ వివాహాలు జరిపించిన షాదీ డాట్కామ్ అనే సంస్థ ఈ పెళ్లిని కూడా అంగరంగ వైభవంగా ఆన్లైన్లో జరిపించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: