ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా  వైరస్ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. అయితే జగన్ సర్కార్ కరోనా  వైరస్ ని తరిమి కొట్టేందుకు ఎన్నో  ముందస్తు జాగ్రత్తలు తీసుకొని కఠిన నిబంధనలు అమల్లోకి తెచ్చినప్పటికీ రోజురోజుకీ మహమ్మారి వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగి పోతూనే ఉంది. మొదట్లో చాలా తక్కువగా నమోదైన కేసుల సంఖ్య ఇప్పుడు క్రమక్రమంగా భారీగా పెరిగి పోతుంది. దీంతో ప్రస్తుతం ఉన్న ఆంక్షలను సడలిస్తూ మరిన్ని కఠిన ఆంక్షలు అమలులోకి తెచ్చేందుకు జగన్ సర్కారు నిర్ణయించింది. కీలక నిర్ణయాలు తీసుకుంటూ కరోనా  యుద్ధంలో ముందుకు సాగుతుంది జగన్మోహన్ రెడ్డి సర్కారు. 

 

 

 అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌట్  కొనసాగుతున్న విషయం తెలిసిందే. కరోనా  వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రజలందరూ ఇంటికే పరిమితం అయ్యేలా చేసేందుకు ప్రభుత్వం లాక్ డౌన్  విధించింది. అయితే లాక్‌డౌన్‌ సమయంలో నిత్య అవసరాల కోసం ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. కొంతమంది నిత్య అవసరాల పేరుతో నిబంధనలను ఉల్లంఘిస్తూ  గుంపులుగా బయట తిరుగుతున్నారు. దీంతో కరోనా  వైరస్ ను కట్టడి చేయాలనే  ప్రభుత్వ లక్ష్యం కాస్త నీరుకారిపోతుంది. అయితే తాజాగా ఏపీ ప్రభుత్వం దీనిపై కీలక నిర్ణయం తీసుకుంది. 

 

 

 కరోనా  కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో తాజాగా జగన్ సర్కార్ ప్రజలకు నిత్య అవసరాలు అందించడం పై కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని కంటైన్మెంట్  జోన్లలో నిత్యావసరాలు తెచ్చుకోవడానికి కుటుంబంలోని ఒక్కరికి మాత్రమే అనుమతిని  ఇస్తూ పాస్ ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. అంతేకాకుండా నిత్యావసరాల దుకాణాలు వీధి చివర లో ఉండేలా చూడాలి అంటూ సూచనలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు బజార్ల ను వీలైనంత ఎక్కువగా వికేంద్రీకరించాలని సూచించిన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి... టమాటా ఉల్లి తో పాటు అన్ని మార్కెటింగ్ ఉత్పత్తులు ధరలపై దృష్టి పెట్టాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: