లాక్‌డౌన్‌పై కేంద్ర ప్ర‌భుత్వం మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. క‌రోనా కేసులు ఎంత‌మాత్రం న‌మోదు కాని ప్రాంతాల్లో లాక్‌డౌన్ నుంచి స‌డ‌లింపు ఇస్తూ శుక్ర‌వారం అర్ధ‌రాత్రి ఉత్త‌ర్వులు జారీ చేసింది.  తాజా ఉత్త‌ర్వుల ప్ర‌కారం.. గ్రామీణ, చిన్నపట్టణాల్లో షాపులు తెరిచేందుకు అనుమతి ల‌భించిన‌ట్ల‌యింది. మున్సిపల్ నివాస ప్రాంతాల్లోని కొన్ని దుకాణాలు తిరిగి తెరిచేందుకు కూడా  కేంద్రం  అనుమతినిచ్చింది. మున్సిపల్ నివాసప్రాంతాల్లో అక్కడక్కడా విడిగా ఉన్న దుకాణాలను 50 శాతం సిబ్బందితో అవసరమైన జాగ్రత్తలు తీసుకొని తెరిచుకోవ‌చ్చ‌ని ఉత్త‌ర్వుల్లో పేర్కొంది. 

 

అయితే కరోనా హాట్ స్పాట్ లు, కంటైనర్ జోన్ లలో మాత్రం అన్ని దుకాణాలను మూసి ఉంచాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. 
అలాగే మునిసిపాలిటీల్లోని మార్కెట్ ప్రదేశాలు, మల్టీబ్రాండ్, సింగిల్ బ్రాండ్ మాల్స్‌ల్లోని దుకాణాలు మాత్రం మే 3వతేదీ వరకు మూసివేయాలని కేంద్ర హోంమంత్రిత్వశాఖ విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.  అయితే షాపుల నిర్వ‌హ‌ణ‌లో జాగ్ర‌త్త‌లు పాటించ‌కుంటే మాత్రం సీజ్ చేయ‌డం జ‌రుగుతుంద‌ని హెచ్చ‌రించింది. సిబ్బంది సామాజిక దూరం పాటించడం, ముఖానికి మాస్క్ లు ధ‌రించేలా చూడాల‌ని సూచించింద‌. అలాగే క‌స్ట‌మ‌ర్ల‌కు ఇబ్బంది క‌ల‌గ‌ని విధంగా ఏర్పాట్లు ఉండాల‌ని తెలిపింది. 

 

ఇదిలా ఉండ‌గా ప్ర‌పంచ‌వ్యాప్తంగా మ‌హ‌మ్మారి క‌రోనా ర‌క్క‌సి క‌రాళ నృత్యం చేస్తోంది.  'కొవిడ్‌-19' వ‌ల్ల చ‌నిపోతున్న వారి సంఖ్య రోజురోజుకీ గ‌ణ‌నీయంగా పెరుగుతూనే ఉంది. అనేక దేశాలు మ‌రుభూమిగా మారుతున్నాయి. క‌రోనా శ‌వాలుగా గుట్ట‌లుగా ప‌డుతున్నాయి.  వంద‌లాది మృత‌దేహాల‌ను సామూహిక ఖ‌న‌నం చేపడుతున్నారు. ఒక్క  శుక్రవారం రోజే క‌రోనాతో వ‌ర‌ల్డ్‌వైడ్‌గా 1.90 ల‌క్ష‌ల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మ‌ర‌ణాల్లో మూడింట రెండో వంతు మ‌ర‌ణాలు యూర‌ప్‌లోనే ఉండ‌టం బాధాక‌రం. వ‌ర‌ల్డ్‌వైడ్‌గా ఇప్పటివ‌ర‌కు 26,98,733 మంది క‌రోనా బారిన‌ప‌డ్డ‌ట్లు డ‌బ్ల్యూహెచ్‌వో ప్ర‌క‌టించింది. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: