దేశాన్ని మొత్తం కబళిస్తూ ప్రజల్లో ప్రాణ భయాన్ని కలిగిస్తున్న కరోనా  వైరస్ ను కట్టడి చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయని ప్రయత్నమంటూ లేదు. అన్ని విధాల ప్రయత్నాలు చేస్తూ కనిపించని శత్రువుతో పోరాటం చేస్తున్నాయి  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. అయినప్పటికీ రోజురోజుకు కరోనా వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగి పోతూనే ఉంది. ముఖ్యంగా కరోనా  వైరస్ సోకిన వారిని సత్వరంగా  గుర్తించక పోవడం వల్లనే ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా జరుగుతుంది అని మరోవైపు విశ్లేషకులు చెబుతున్న మాట. అంతేకాకుండా కరోనా  వైరస్ పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆ ఫలితాలు రావడానికి చాలా సమయం పడుతుండటంతో ఈ లోగా కరోనా వైరస్ కు సంబంధించి వ్యాప్తి జరిగిపోతుంది అని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

 

 

 అయితే కరోనా వైరస్ అనుమానితులు చాలా మంది ఉన్నప్పటికీ టెస్టులు మాత్రం అతి తక్కువగా జరుగుతున్నాయని మరి కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కరోనా  వైరస్ లక్షణాలు కనిపించిన ప్రతి ఒక్కరిని సత్వరంగా పరీక్షలు నిర్వహించి కరోనా  ఉందా లేదా అనే విషయాన్ని తొందరగా నిర్ధారిస్తే వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు వీలుంటుంది అంటూ  నిపుణులు సూచిస్తున్నారు. అయితే తాజాగా కరోనా వైరస్ సత్వరంగా గుర్తించేందుకు భారత్కు చెందిన శాస్త్రవేత్త ఓ సాఫ్ట్వేర్ ను  అభివృద్ధి చేశారు. కేవలం ఐదు సెకన్లలోనే ఈ మహమ్మారి వైరస్ ను నిర్ధారించేందుకు ఓ సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేసినట్లు ఐఐటీ రూర్కీ ప్రొఫెసర్ కమల్ జైన్ చెబుతున్నారు. 

 

 

 కరోనా  వైరస్ సోకినా వారి ఎక్స్ రే  స్కాన్ పరిశీలించడం ద్వారా... కరోనా  వైరస్ను గుర్తించవచ్చు అంటూ తెలిపిన ఆయన ఈ సాఫ్ట్ వేర్ ద్వారా పరీక్షలు జరిపితే ఖర్చుకూడా చాలా తక్కువగా ఉంటుందని... అంతేకాకుండా వైద్య సిబ్బందికి సోకే ప్రమాదం కూడా తక్కువగా ఉంటుంది అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఈ సాఫ్ట్వేర్ ను  అభివృద్ధి చేసేందుకు కరోనా  వైరస్,  న్యుమోనియా సహా  మొత్తం 60 వేల ఎక్స్ రే, స్కాన్లను విశ్లేషించి అభివృద్ధి చేసినట్లు తెలిపారు. ఊపిరితిత్తుల్లో చేరుకున్న శ్లేషం  కారణంగా ఈ వైరస్ను గుర్తించగలిగామని  ఆయన చెప్పుకొచ్చారు. ఈ వైరస్ ద్వారా కేవలం ఐదు సెకన్లలోనే కరోనా  ఉందా లేదా అనేది  నిర్ధారించవచ్చును తెలిపారు. అంతేకాకుండా బాడీ టెంపరేచర్ తో  కరోనా  లక్షణాలను గుర్తించి రిమోట్ కంట్రోల్ ఆపరేటింగ్ కూడా అభివృద్ధి చేసినట్లు ఐఐటీ రోపర్ పరిశోధకులు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: