కరోనా వైరస్ మేధావుల మెదడుకు పెద్ద పజిల్‌గా మారింది.. వైద్యశాస్త్రాన్నే అభాసుపాలు చేస్తుంది.. ఈ వైరస్ వచ్చి ఇన్ని నెలలు అవుతున్న దీని విషయంలో ఒక క్లారీటి రాలేదు.. ఇప్పటికే దేశ ఆర్దిక పరిస్దితులు చేయి దాటిపోతున్నాయి.. ఈ వైరస్ విషయంలో క్లారీటి వచ్చే సరికి మిగిలేది సమస్యలే.. అంతే కాకుండా ఈ కరోనా రోజుకోరకంగా ఊసరవెళ్లిలా మారుతూ అసలు కరోనా రోగుల లక్షణాలు ఇవని పక్కాగా చెప్పలేని విధంగా రూపాంతరం చెందుతుంది.. ఇకపోతే ఈ కరోనా ఒక్క ఊపిరితిత్తులపైనే కాదు.. శరీరంలో పలు అవయవాలపై దీని ప్రభావం ప్రమాదకర స్థాయిలో ఉంటుందట. అందులో ముందుగా చెప్పుకోవలసిన అవయాలు.. కళ్లు, గొంతు, గుండె, కాలేయం, మూత్రపిండాలు, మెదడు.. ఇలా మనిషి శరీరంలోని ప్రతి అవయవంపై ఈ వైరస్ దాడి చేస్తుందనే విషయాన్ని లండన్ కింగ్స్ కాలేజీ ఆస్పత్రికి చెందిన ప్రొఫెసర్ అజయ్ షా పేర్కొంటున్నారు..

 

 

కొంతమంది కరోనా రోగులను పరీక్షించిన ఆయన ఈ భయానక అంశాలను వెల్లడించారు. ముఖ్యంగా ఈ వైరస్ ముక్కు ద్వార గొంతు లోపలికి వెళ్లి అక్కడి నుంచి ఊపిరితిత్తుల్లోకి వెళ్లొచ్చు. అప్పుడే రోగి వాసన గ్రహించలేని స్థితికి చేరుకుంటాడు. ఆ తర్వాత గొంతులోకి ప్రవేశిస్తుంది. అక్కడ ఉండే ACE2 ప్రొటీన్ ను తన స్పైక్ ల సాయంతో గ్రహించి, కణాల్లోకి చేరి పునరుత్పత్తి మొదలుపెడుతుంది. ఆసమయంలో రోగిలో వ్యాధి లక్షణాలు ఉండకపోవచ్చు. కానీ, ఇతరులకు వ్యాప్తి చేయగలదు. ఇక ఊపిరితిత్తుల్లోకి చేరగానే ఈ వైరస్ లక్షల సంఖ్యలో శ్వాసకోశాలను ఆక్రమించేస్తుంది. ఫలితంగా న్యుమోనైటిస్ కు దారితీస్తుంది. అందువల్ల ఊపిరితిత్తుల కండరాల్లో వాపు వస్తుంది. అప్పుడు రోగి శ్వాస తీసుకోలేకపోవడం వల్ల  రక్తంలో ఆక్సిజన్ ప్రమాదకర స్థాయికి తగ్గిపోతుంది. దీనివల్ల గుండె వేగంగా కొట్టుకుంటుంది. రక్తనాళాల్లో వాపు వస్తుంది. అందువల్ల 20 శాతం రోగుల్లో కిడ్నీలు కూడ దెబ్బతింటున్నాయి. ఇలా పలు అవయవాలు దెబ్బతినడం కారణంగా చనిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది.

 

 

ఇదిలా ఉండగా చైనాలోని వుహాన్లో 416 మంది కరోనా బాధితుల్లోనూ 20 శాతం మంది గుండె సమస్యలతో మరణించినట్లు జామా కార్డియాలజీ జర్నల్ పేర్కొంది. కొవిడ్ తీవ్ర స్థాయిలో ఉన్న రోగుల్లో రక్తనాళాల్లో వాపు ఎక్కువగా కనిపిస్తోందని వైద్యులు అంటున్నారు. అయితే డయాబెటిస్, గుండెజబ్బులు ఉన్న వారికి కరోనావల్ల ముప్పు ఎక్కువ.. తాజాగా ఆస్పత్రిలో చేరిన రోగుల కాలేయాల్లో ఎంజైమ్స్ శాతం ఎక్కువగా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అసలు ఈ పరిస్థితికి కారణం ఔషధాలా.. లేక వ్యాధినిరోధక శక్తి అతిగా స్పందించడమా.. అనేది అంతుపట్టడం లేదట. ప్రస్తుతానికైతే దీనిపై పరిశోధనలు జరుపుతున్నారు. ఇకపోతే ఇటీవలే కరోనా వైరస్ మెదడుపై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తుందని, అందువల్ల మూర్ఛ, తలనొప్పి వంటి లక్షణాలు బయటపడుతున్నాయని గుర్తించారు.. ఏది ఏమైనా ఈరోజు కనిపించిన లక్షణాలు మరోసారి పరీక్ష చేస్తే కనిపించడం లేదు.. మాయలమరాఠిలా ప్రవర్తిస్తున్న కరోనా మానవాళికి పెద్దముప్పునే తెచ్చిపెట్టింది..  

మరింత సమాచారం తెలుసుకోండి: