ప్రపంచాన్ని  మొత్తం కబళిస్తున్న కరోనా  వైరస్ ను కంట్రోల్ చేసేందుకు ఆయా దేశాల ప్రభుత్వాలు ఎంతో కఠిన నిబంధనలు అమల్లోకి తెస్తూ  సర్వశక్తులూ ఒడ్డుతున్నా విషయం తెలిసిందే. అయినప్పటికీ కంటికి కనిపించని ఈ మహమ్మరి  ఏదో విధంగా దాడి చేసి ఎంతో మందిని బలి తీసుకుంటుంది. ఈ మహమ్మారి వైరస్ బారినపడి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు  అయితే ఈ వైరస్ వెలుగులోకి వచ్చి  నెలలు గడుస్తున్నప్పటికీ ఈ వైరస్కు సరైన విరుగుడు మాత్రం లేదు. అయితే ఈ వైరస్ కు విరుగుడు కనిపెట్టే పనిలో నిమగ్నమై పోయారు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు. ఈ క్రమంలోనే కొంతమంది శాస్త్రవేత్తలు సాహసాలు  చేసేందుకు వెనకడుగు వేయడం లేదు. 

 

 

 తాజాగా ఓ శాస్త్రవేత్త చేసిన పని చూస్తే కరోనా  వైరస్పై విజయం సాధించేందుకు శాస్త్రవేత్తలు ఎలాంటి సాహసాలు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఆమె ఒక మైక్రో బయాలజీస్టు... కరోనా  వైరస్ లాంటి వైరస్ల గురించి పూర్తిగా తెలిసిన శాస్త్రవేత్త. అయితే భారీ పారితోషికాలు తీసుకుని పరిశోధన చేసే అవకాశం ఉన్నప్పటికీ కరోనా వైరస్ విజృంభిస్తూ ప్రజల ప్రాణాలను బలితీసుకుంటూ  తీవ్ర సంక్షోభాన్ని మిగులుస్తున్న వేళ మానవాళికి తన వంతుగా ఏదైనా చేయాలని నిర్ణయించుకుంది. ఆమె పేరే ఎలిసా  గ్రానటో . లండన్కు చెందిన ఈ శాస్త్రవేత్త ఏకంగా కరోనా  వైరస్పై యుద్ధంలో భాగంగా తన ప్రాణాలను సైతం పణంగా పెట్టేందుకు కూడా సిద్ధమైంది. 

 

 

 బ్రిటన్లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన కరోనా వైరస్ టీకాలు నిర్వహించే పరిక్షలకు ఆమె పేరు కూడా వాలెంటర్ గా నమోదు చేయించుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయితే ఈ టెస్ట్ కోసం ఏకంగా ఎనిమిది వందల వాలెంటర్ల్లు ఎంపిక అవ్వగా వారిలో టీకా వేయించుకున్న తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించింది ఈ శాస్త్రవేత్త. అయితే ఈ టీకా వల్ల ప్రాణాలకే ముప్పు ఉంటుందని తెలిసినప్పటికీ కూడా... తన 32 వ పుట్టినరోజు నాడు ఏప్రిల్ 23న వైరస్పై ప్రయోగాత్మకంగా తయారు చేసిన వాక్సిన్ ను  ఆమె ఎంతో ధైర్యంగా వేయించుకుని అందరికీ ఆదర్శంగా నిలిచింది. విపత్తుల సమయంలో కేవలం ఔషధాలను కనుగొనడమే కాదు.. ఔషధ పరీక్షల్లో కూడా భాగస్వామ్యం కావాలని తాను భావిస్తున్నట్టు చెప్పుకొచ్చారు ఆమె. మానవాళిని  రక్షించే క్రమంలో భాగమైనందుకు ఎంతో గర్వంగా ఉంది అంటూ పేర్కొన్నారు, కాగా ఈ టీకాను ఇప్పటివరకు ఇద్దరికి మాత్రమే వెయ్యగా..  వారిలో వచ్చిన మార్కుల ఆధారంగా ఈ వాక్సిన్ మరింత మంది పై ప్రయోగించిననున్నారూ అక్కడ పరిశోధకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: