ఎండ ఎక్కువైతే కరోనా వైరస్ చనిపోతుందా? ఎంత ఎండ ఉంటే అంత మంచిదా..? మందులేని ఈ మహమ్మారికి మండే సూర్యుడే మందా? అంటే అవుననే అంటున్నారు అమెరికా శాస్త్రవేత్తలు. దీనిపై వివిధ దేశాల శాస్త్రవేత్తలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నా.... అమెరికా ప్రభుత్వం చేసిన పరిశోధనల్లో ఇది నిజమేనని తేలింది. 35 డిగ్రీలు దాటితే చాలు వైరస్ చనిపోతుందని తేల్చాయి అక్కడి పరిశోధనలు. ఇదే నిజమైతే భారత్‌కు ఇదొక శుభవార్త.

 

ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ అంతు చూసేందుకు వందలాది ప్రయోగాలు జరుగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 180కిపైగా సంస్థలు వైరస్ నిరోధ వ్యాక్సిన్ కనుగొనే పరిశోధనల్లో నిమగ్నమై ఉన్నాయ్‌. మరో 150 సంస్థలు తర్వలో రంగంలోకి దిగబోతున్నాయి. వ్యాక్సిన్ పరిశోధనలతోపాటు ఇతర వాటి మీద కూడా దృష్టి సారించారు శాస్త్రవేత్తలు. అమెరికా హోం ల్యాండ్ సెక్యూరిటీలో ఓ ఆసక్తి ప్రయోగం జరిగింది. ఎండలు పెరిగితే కరోనా వైరస్‌ చనిపోతుందని ఆ సంస్థ వెల్లడించింది. అమెరికా హోం ల్యాండ్‌ ఆ దేశ అధికార సంస్థ కావడంతో ఇప్పుడు వారి ప్రకటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 35 డిగ్రీల ఎండలో వైరస్‌ బతకదని ఈ సంస్థ తెలిపింది. ఎండ తీవ్రతకు గాల్లో ఉన్నా కరోనా వైరస్‌ చనిపోతుందని తెలిపింది. ఎండ నేరుగా వైరస్‌ పైనా పడినా అది తక్షణమే చనిపోతుందని కనుగొన్నారు.

 

ఎక్కడైతే ఎండ తీవ్రత ఎక్కువ ఉందో... అక్కడ వైరస్ విస్తరణ తగ్గపోవడాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. అమెరికాలో డిపార్ట్మెంట్ ఆఫ్ హోం ల్యాండ్ సెక్యూరిటీ ఆధీనంలో ఉండే అత్యాధునిక బయో కంటైన్మెంట్ ల్యాబ్‌లో ఈ పరిశోధనలు జరిగాయి. పరిశోధనా ఫలితాలను కోవిడ్ విస్తరిస్తున్న ప్రాంతాలు, అక్కడ ఉన్న ఉష్టోగ్రతలతో పోల్చి చూసినప్పుడు... అవి సరైనవిగా తేలాయి. 35 డిగ్రీల ఉష్టోగ్రత తర్వాత కరోనా జీవించలేదనే నూటికి నూరుపాళ్లు నిర్ధారించుకున్నట్టు ప్రకటించారు యూఎస్ శాస్త్రవేత్తలు. అమెరికా పరిశోధనలపై ఇంకా పూర్తిస్థాయిలో స్పష్టత రావాల్సి ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

 

ఒక రూంలో 70-75 డిగ్రీల ఫారెన్ హీట్, 20 శాతం హుమిడిటీలో కరోనా వైరస్ ను ఉంచినప్పుడు... గంట వరకు మాత్రమే కరోనా బతికి ఉంది. అదే నేరుగా ఎండలోకి వెళ్తే 35 డిగ్రీల వేడిలో వైరస్ జీవిత కాలం 18 గంటల నుంచి అర నిమిషానికి పడిపోతుంది. అంటే ఆల్మోస్ట్ వైరస్ చనిపోయినట్టే. అంటే ఎంత ఎండ ఉంటే కరోనా నుంచి అంత రక్షణ లభించినట్టే. ఇప్పటికే మన దేశంలో ఎండల తీవ్రత పెరిగింది. ఏ రాష్ట్రం చూసినా కనీస ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలు దాటిపోయాయి. ఈ నెలాఖరుకు అవి మరింత పెరగవచ్చు. ఒకవేళ అమెరికా పరిశోధనలే నిజమే అయితే.... వచ్చే కొద్ది రోజుల్లోనే కరోనా నుంచి మన దేశానికి విముక్తి లభించినట్టే. 

మరింత సమాచారం తెలుసుకోండి: