పనీ పాటా లేకుండా రోడ్డెక్కుతున్నారా? ప్రభుత్వం ఎంత మొత్తుకుంటున్నా మీ చెవులకు ఎక్కడం లేదా? రోడ్లు ఖాళీగా ఉన్నాయని బండి మీద షికార్లు చేస్తున్నారా? ఇలాంటి మైండ్‌సెట్‌ ఉన్నవారు బొక్కబోర్లా పడక తప్పదు. మీ బండి సీజ్‌చేయడమే కాదు... కేసులు కూడా నమోదవుతాయ్‌. ఇలా తెలంగాణలో ఎన్నికేసులు నమోదయ్యాయ్‌? ఎన్ని వెహికల్స్‌ సీజ్‌ చేశారో తెలిస్తే వామ్మో అనాల్సిందే. 

 

తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. లాక్‌డౌన్‌ అమల్లో ఉన్నప్పటికీ వైరస్‌ కు అడ్డుకట్ట పడటం లేదు. తెలంగాణలో వచ్చే కేసుల్లో 80 శాతానికి పైగా హైదరాబాద్‌లోనే నమోదవుతున్నాయి. దీంతో లాక్‌డౌన్‌ను మరింత పటిష్టంగా అమలు చేస్తున్నారు అధికారులు. అవసరం లేకుండా రోడ్ల మీదకు వచ్చినా... మాస్క్‌ లేకపోయినా..  కేసులు నమోదు చేయడమే కాకుండా వాహనాలను కూడా చేస్తున్నారు పోలీసులు. 

 

లాక్‌డౌన్ అమలు కోసం పోలీసులు తీవ్ర కష్టపడుతున్నారు. కుటుంబాలను వదిలేసి పోలీసులు రోడ్డుపైనే మకాం వేసి హెచ్చరికలు చేస్తున్నారు. కానీ ప్రజల్లో మాత్రం మార్పు రావడం లేదు. పోలీసుల చెక్ పొస్టులను సైతం లేక్క చేయడం లేదు. నిత్యావసర వస్తువుల కోసం మూడు కిలో మీటర్లు దాటొద్దని చెప్పినా మాట వినడం లేదు. చిల్లీ రీజన్స్‌తో రోడ్డుపైకి వస్తూనే ఉన్నారు. హెల్మెట్‌తో పాటు ఇంటి దృవ పత్రాలను కూడా తప్పని సరిగా తమ దగ్గర పెట్టుకోవాలని పోలీసులు చెబుతున్నా అవేమీ తమకు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. 

 

అవసరం లేక పొయినా రోడ్డు మీదకు వచ్చి హంగామా చేస్తున్న వారిపై పోలీసులు కఠినంగా వ్యవహారిస్తున్నారు. ఇప్పటి వరకు తెలంగాణ వ్యాప్తంగా లక్షా ఆరవై వేలకు పైగా వాహానాలను సీజ్ చేశారు పోలీసులు. జంటనగరాల్లోనే దాదాపుగా  పదిహేను లక్షల వాహానాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీటిలో సైబరాబాద్ పరిధిలో ఆరు లక్షల వాహానాలపైన కేసులు నమోదు చేయగా.. హైదరాబాద్ పరిధిలో దాదాపుగా ఐదు లక్షలు.. రాచకొండ పరిధిలో మరో నాలుగు లక్షల వాహనాలపై కేసులు నమోదయ్యాయి. ఈ వాహనాలను ఇప్పటికిప్పుడు తిరిగి ఇచ్చే ప్రసక్తే లేదు. లాక్ డౌన్ పూర్తైన తర్వాత ఈ వాహనాలను కోర్టుకు అప్పగిస్తారు. కొర్టు నిర్ణయం మేరకు వాహనాలను తిరిగి ఇస్తామని తెలిపారు సైబరాబాద్ సీపీ సజ్జనార్‌. 

 

పోలీసులు లక్షల సంఖ్యలో వాహానాలు సీజ్ చేసినప్పటికీ ప్రజల్లో మాత్రం భయం రావడంలేదు. చాలా మంది ఎలాంటి పత్రాలు లేకుండా రోడ్డు మీదకు వచ్చే వారు  ఎక్కవగా వున్నారు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: