ప్రస్తుత కరోనా పుణ్యమా అని బతుకుదెరువు కోసం వలస వెళ్లిన కార్మికులు బతుకు జీవుడా అంటూ కాలిబాటన వారి కుటుంబాల చెంతకు చేరాలని ప్రయత్నం చేస్తున్నారు. దేశం మొత్తం మీద ఎక్కడ రైలు కానీ బస్సులు కానీ లేని సమయంలో వారు వారి దగ్గరికి చేరడానికి నడిచి వెళ్ళడానికి సిద్ధం అవుతున్నారు. అయినా సరే పోలీసులు ఎటువంటి కనికరం లేకుండా వారిని క్వారంటైన్ కు పంపుతున్నారు. పాపం వారు అక్కడ ఉండలేక తమ వారి కోసం వెళ్లిపోయే రోజు ఎప్పుడు వస్తుందా అని దిగాలు చెందుతున్నారు. ఇక అయితే ఈ పరిస్థితుల్లో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇతర రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చల ఫలితంగా ఇతర రాష్ట్రాల్లో తమ వారిని వారి ఇళ్లకు చేర్చే ఆలోచనలు చేస్తున్నారు.


ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తమ ప్రజల్ని తిరిగి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్న దశలో తాజాగా వీరి బాటలోనే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ లాక్ డౌన్ దెబ్బతో తమ ప్రాంత మనుషులు వారి స్వస్థలాలకు తీసుక వస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. అయితే ఇప్పటికే గుజరాత్ లో  చిక్కుకున్న కొంత మంది మత్యకారులను వెనక్కి తీసుకు రావడం కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తమ వారి స్వస్థలాలకు తీసుక రావడం కోసం ఉత్తరప్రదేశ్ సీఎం ఆదిత్యనాథ్ ప్రయత్నాలు మొదలుపెట్టారు.


ఇకపోతే ప్రస్తుతం మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ ఈ విషయం సంబంధించి ఇప్పటికే ఉత్తరప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్ ముఖ్య మంత్రులతో చర్చలు జరిపారని ఆయా రాష్ట్ర ముఖ్యమంత్రులు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ కి సహకారం అందించేందుకు పూర్తి హామీ ఇచ్చారని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం దేశంలో రోజురోజుకు పెరుగుతున్న కేసులు దృష్ట ఇతర రాష్ట్రాల్లో తమ వారిని తీసుకువచ్చే క్రమంలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎవరినైతే ఇలా తీసుకువచ్చారో వారిని 14 రోజులపాటు వారం  క్వారంటైన్ సెంటర్లకు పంపించి పూర్తి ఆరోగ్యవంతులైన తర్వాతే వారి ఇళ్లకు పంపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: