కొత్త‌గా పెళ్ళైన‌వాళ్ళు  ఏమాత్రం కాస్త ఎక్కువ ప‌ని ఉన్నా ఒత్తిడికి గుర‌వుతున్నారు. దీంతో చాలా మంది యువ‌తీ యువ‌కులు పెళ్ళైన కొత్త‌లోనే  విడిపోతున్నారు. నేటి యువ‌త‌కు బంధాల‌కు అనుబంధాలు విలువ‌లు తెలియ‌డం లేదు. ఒక‌ప్పుడు వివాహ బంధ‌మంటే ఎంతో గౌర‌వం ఉండేది. నేటి యువ‌త‌లో ఆ వివాహానికి సరైన అర్థం తెలియడం లేదని, కలసి ఉండటంలో పొందాల్సిన ఆనందం పొందలేకపోతున్నామన్నది విడిపోతున్న జంటల మాట.

 

భార్యా భ‌ర్త‌లు ఇద్ద‌రూ క‌ష్ట‌ప‌డితేనేకాని నేడు ఇల్లు గ‌డ‌వ‌డం క‌ష్టంగా మారింది. దాంతో ఇద్ద‌రూ కూడా బిజీ లైఫ్‌ని అనుభ‌విస్తున్నారు. అలాగే నేడు వారు ఎంచుకున్న కెరియ‌ర్లో ఉండే ఒత్తిడి అత్యధికంగా ఉంటోంది. ఆ ఒత్తిడిని తట్టుకోలేక, ఆఫీసును ఇంటిలోకి తెచ్చుకుని కొంత మంది ఆన్‌లైన్ వ‌ర్క్స్ చేస్తున్నారు. దాంతో వ్యక్తిగత జీవితానికి సమయం లేకుండా చేసుకుంటున్నారు. కాని వారికి అర్థంకాని విషయం వైవాహిక జీవితంలో ఎదుర్కొంటున్న ఒత్తిడికి విరుగుడు వారి చేతిలోనే ఉంద‌న్న వాద‌న వినిపిస్తోంది.

 

అది ఎలాగంటే... మానసిక ఒత్తిడికి మందు సెక్స్. సెక్స్‌పట్ల సుముఖత కలిగితే మిగిలిన ఒత్తిడి దానంతట అదే పోతుంద‌ని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. సెక్స్‌కి మనసుండాలన్నది నిజమే అయినా సెక్స్‌లో నుండి ఆ మనసును తెచ్చుకోవచ్చు.

 

మొదట సెక్స్‌ని ఆనందించండి. ఆ తర్వాత జంటలో ఏ ఒక్కరికి ఒత్తిడి అనిపించినా రెండవవారి కౌగిలిలో ఇమిడిపోండి. దాని వ‌ల్ల శారీర‌కంగా మాన‌సికంగా రెండు విధాల ఒత్తిడి త‌గ్గుతుంది. ఒకరికి సెక్స్ మూడ్ రాగానే రెండవవారు కాస్త‌ సహకరించి సంతృప్తి ప‌రిస్తే చాలు, తృప్తిపొందితే మరుసటి రోజు నుండి సరిగ్గా అదే సమయం ఎప్పుడు వస్తుందా అని మీరే ఎదురు చూస్తారు. ఒత్తిడిని పారదోలేందుకు ట్రై చేయండి మరి. ఆ విధంగా భార్య‌కు ఒత్తిడి క‌లిగిన‌ప్పుడు భ‌ర్త‌. భ‌ర్త‌కు కావ‌ల‌సిన‌ప్పుడు అర్ధం చేసుకుని భార్య శారీర‌కంగా ద‌గ్గ‌ర‌యితే వారి ఒత్తిడి త‌ప్ప‌కుండా దూర‌మ‌వుతుంది. అదొక్క‌టే ప్ర‌ధాన‌మైన మందు అని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: