జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కరోనా వైరస్ కట్టడి విషయంలో ఎక్కడా ఎటువంటి రాజకీయ వ్యాఖ్యలు చేయకుండా పరిణితి చెందిన నాయకుడి గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఉన్న కొద్దీ పెరుగుతున్న విషయం అందరికీ తెలిసినదే. రాష్ట్రంలో అన్ని జిల్లాలో కంటే కర్నూలు జిల్లాలో ఎక్కువ  కేసులు నమోదు అయ్యాయి. శుక్రవారం ఒక్కరోజే దాదాపు 27 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇలాంటి సమయంలో ఎలాంటి రాజకీయ విమర్శలు చేయకుండా పవన్ కళ్యాణ్ కర్నూలు జిల్లా పై జగన్ ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలని, నివారణ చర్యలు చేపట్టాలని లేకపోతే చేయి దాటి పోయే పరిస్థితి వస్తుందని తెలిపారు.

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిగతా పార్టీల నాయకులకు భిన్నంగా పవన్ కళ్యాణ్ స్పందించడం జరిగింది. ప్రపంచంలో ఎన్నడూ ఎదుర్కొని ఇటువంటి సమస్య నీ ఇలాంటి విపత్కర సమయం లో దేశాలు అన్ని కలసికట్టుగా పనిచేసి పోరాడుతున్నాయి. మనదేశంలో చాలా రాష్ట్రాల్లో కూడా అధికార, ప్రతిపక్ష అనే తేడా లేకుండా కరోనా వైరస్ తో పోరాడుతున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ప్రభుత్వం ఎంత పోరాడుతున్నా గాని విపక్షాలు ఆరోపణలు చేస్తూనే ఉన్నాయి.

 

తెలుగుదేశం పార్టీ నాయకులు అదేవిధంగా ఇటీవల కన్నా లక్ష్మీనారాయణ కరోనా వైరస్ అనేది జగన్ ఇంటి నుండి రాష్ట్రంలోకి వచ్చింది అన్నట్టుగా సన్నివేశాలను క్రియేట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం కరోనా వైరస్ కట్టడి విషయంలో ఎక్కడా రాజకీయ విమర్శలకు పోకుండా బాధ్యత రాజకీయ నేతగా మాట్లాడటంతో.. సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపుకు ఏపీ ప్రజలు పవన్ ని చూసి కొన్ని పార్టీల నాయకులు నేర్చుకోవాల్సింది చాలా ఉందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: