ప్రస్తుత రోజులలో డబ్బు కోసం  మనుషులు ఎలా దిగజారి పోతున్నారు అంటే మానవ సంబంధాలు కూడా అలాగే పోతున్నాయి. డబ్బు కోసం ఎటువంటి దారుణాలకైనా తెగిస్తున్నారు అనే చెప్పాలి. అంతే కాకుండా సొంత వాళ్లని కూడా  చూడకుండా చంపడానికి దారుణంగా ప్రవర్తిస్తున్నారు. అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వలేదని కన్న తండ్రి సొంత కొడుకుని చంపేసిన ఘటన తాజాగా వెలుగులోకి రావడం జరిగింది. తన దగ్గర తీసుకున్న డబ్బులు ఎక్కడ ఇవ్వకుండా దేశం దాటి పోతాడో అన్న అనుమానంతో చంపేశాడు ఈ దుర్మార్గుడు. ఈ దుర్ఘటన గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ జిల్లాలో చోటు చేసుకోవడం జరిగింది. వివరాల్లోకి వెళితే... రని తల్వి ప్రాంతంలోని బందరు వాడికి చెందిన అబ్దుల్ హమీద్ కు మనియర్ కు కొడుకు ఇమ్రాన్. 

 


అయితే గత పది సంవత్సరాల కిందట ఇమ్రాన్ లండన్ కి వెళ్లి అక్కడే సెటిలైపోయాడు. తాజాగా భార్య కొడుకులతో కలిసి సొంత గ్రామానికి రావడం జరిగింది. తన స్వగ్రామంలో ఉండే ఇంటిని రిపేర్ చేసి బాగు చేసేందుకు తండ్రి ఆత్మ దగ్గర  లక్షా ఎనభై వేల రూపాయలు తీసుకోవడం జరిగింది. ఇక నెల రోజుల కిందటే ఇంటిని బాగా చేయించాడు. ఇక యూపీఏ పౌరుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విమానంలో తిరిగి లండన్ కి వెళ్లవలిసిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఆ విషయం తండ్రికి తెలియడంతో.. నా దగ్గర తీసుకున్న అప్పు ఇవ్వు రా అని కొడుకుని అడిగాడు. కొడుకు ఇమ్రాన్ ఇంటిని బాగు చేయించేందుకు నేను స్నేహితుల వద్ద కూడా అప్పు తీసుకున్నాను.. వాళ్ళ అప్పు తీరుస్తాను ఆ తర్వాత నీకు ఇస్తా నాన్న అని తెలిపాడు. నేను అప్పు తిరిగి ఇచ్చేంతవరకు ఇంట్లో ఒక పోర్షన్ అద్దెకు ఇచ్చి ఆ అద్దె డబ్బులు వసూలు చేసుకో నాన్న అని తెలిపాడు. 

 


కానీ కొడుకు చెప్పిన ప్రతిపాదన తండ్రికి నచ్చలేదు. దీనితో తన గదిలోకి వెళ్లి భార్యతో కూడా గొడవ పడ్డాడు. దీనితో కొడుకు ఇమ్రాన్ తండ్రి గదిలోకి వెళ్లడంతో వివాదం మరి ఎక్కువ అయిపోయింది. ఇద్దరూ బాగా గొడవకు దిగారు. దీనితో తండ్రికి కోపం వచ్చి కొడుకుని ఇమ్రాన్ కత్తితో పొడిచేసాడు. భుజంపై చేతి కింద భాగంలో బలంగా పొడవడంతో ఇమ్రాన్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. రక్తపు మడుగులో ఉన్న ఇమ్రాన్ ని హాస్పిటల్ కి తీసుకెళ్ళి చికిత్స అందజేశారు. ఇక చికిత్స పొందుతూనే ఇమ్రాన్ తన ప్రాణాలను కోల్పోయాడు అని డాక్టర్లు తెలియజేశారు. ఇక ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసుకొని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: