గ‌త కొద్దికా‌లంగా అనేకమంది ఎదురు చూస్తున్న అంశంలో ఓ క్లారిటీ రానుంది. ప్రస్తుతం కరోనా విజృంబిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం వచ్చే మే 3 వరకు లాక్ డౌన్‌ను పొడిగించింది. అయితే అత్యవసర వస్తువుల అమ్మకానికి అనుమతి ఇచ్చింది. దీంతో పాటు టెలికాం, ఇంటర్నెట్ ప్రసారం, ఐటీ సేవల కార్యకలాపాలకు కేంద్రం అంగీకరించింది. ‘ఎసెన్షియల్ సర్వీసెస్’ కేటగిరీలో మెబైల్ ఫోన్లతో పాటు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను చేర్చాలని కేంద్రాన్ని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ ( CIIT ) కోరింది. కేంద్రం అనుమ‌తి ఇస్తే ఈ మేర‌కు మొబైల్లు అందుబాటులోకి రానున్నాయి. 

 

లాక్ డౌన్ కారణంగా 2.5 కోట్ల మొబైల్ వినియోగదారులు వారి ఫోన్‌లకు చెందిన విడిబాగాలు దొరక్క ఇబ్బంది పడుతున్నారని ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ ( ICEA ) అంచనా వేసింది. లాక్ డౌన్ మే చివరి  వరకు కొనసాగితే దాదాపు 4 కోట్ల మంది ప్రజలు మొబైల్ సమస్యలతో బాధపడతారని చెప్పింది. ఈ నేప‌థ్యంలో మొబైల్ అమ్మకాలను కూడా ఎసెన్షియల్ సర్వీసెస్ కేటగిరిలో చేర్చి ఫోన్లు, విడిబాగాలు, ల్యాప్ టాప్‌ల అమ్మకానికి అనుమతులివ్వాలని సీఐఐటీ కోరింది. ఈ నెల22న కేంద్ర హోం శాఖకు ఈ మేరకు లేఖ రాసింది. ఆరోగ్య సేతు యాప్ ను వాడాలన్నా స్మార్ట్ ఫోన్ అప్‌గ్రేడ్ చేయాల్సి ఉంటుందని, అయితే సరైన ఫోన్​ లేకపోవడం వల్ల కోటి మంది యాప్ సేవలను ఉపయోగించుకోకుండా ఉంటారని తాము భావిస్తున్నట్లు ICEA  చైర్మన్ పంకజ్ మొహింద్రూ చెప్పారు. 

 

ఇదిలాఉండ‌గా, ఇటీవ‌లి కాలం వ‌ర‌కు మొబైల్‌ ఫోన్ల‌‌‌పై 12 శాతం  జీఎస్టీని, కొన్ని కాంపోనెట్స్​పై 18 శాతం జీఎస్టీని వసూలు చేశారు. గ‌త‌ నెల 14న జ‌రిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో  జీఎస్టీని  ప్రభుత్వం18 శాతానికి పెంచింది. ఈ నిర్ణ‌యం మొబైల్ ఫోన్ వినియోగ‌దారుల‌ను ప్ర‌భావితం చేయ‌నుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: