తనకు తాను ఎక్కువ ఊహించుకుని ఎగిరెగిరిపడ్డ ఏపీ బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పరిస్థితి దారుణంగా తయారైంది. కొద్ది రోజుల క్రితం ఏపీ ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో 'కన్నా' విమర్శలు చేశారు. ముఖ్యంగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు దక్షిణ కొరియా నుంచి వైసీపీ ప్రభుత్వం కొనుగోలు చేసిన కరోనా టెస్టింగ్ కిట్ల విషయంలో ప్రభుత్వంపై విమర్శలు చేశారు. వాటిని కొనసాగిస్తూ కన్నా మరింత తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. దీనిపై వైసీపీ నేతలు కూడా అదే రేంజ్ లో విమర్శలు చేయడంతో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. కన్నా వర్సెస్ వైసీపీ అన్నట్టుగా వ్యవహారం సాగింది. రోజుకో లేఖ రాస్తూ, రోజుకో ఆరోపణలు చేస్తూ వైసీపీ ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేసిన కన్నా ప్రభుత్వ ప్రతి నిర్ణయాన్ని తప్పు పడుతూ విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్ ను ఉద్దేశించి వ్యక్తిగతంగా విమర్శలు చేశారు. దీనికి కౌంటర్ గా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కన్నా పై అదే స్థాయిలో విమర్శలు చేశారు. 

 

IHG


టీడీపీ అధినేత చంద్రబాబుకు 20 కోట్లకు అమ్ముడు పోయారని విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో బీజేపీ అధిష్టానం జోక్యం చేసుకుని కన్నాపై  ఆగ్రహం వ్యక్తం చేసినసంగతి తెలిసిందే. సరైన ఆధారాలు లేకుండా విమర్శలు చేయడం ఏంటని మండిపడింది. అంతేకాకుండా ప్రస్తుతం దేశం మొత్తం కరోనా బెంగతో ఉంటే ఈ సమయంలో మీరు ఏ విధంగా విమర్శలు చేస్తున్నారని, బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కన్నాను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రశ్నించారు. అంతేకాకుండా ఇకపై తగిన ఆధారాలు తమకు పంపించి, మా అనుమతితో మాత్రమే విమర్శలు చేయాలి అంటూ హెచ్చరికలు చేయటంతో పూర్తిగా కన్నా లక్ష్మీనారాయణ సైలెంట్ అయిపోయారు. 

 


అయితే ఏపీ ప్రభుత్వంపై పోరాటం చేస్తూ బీజేపీని బలోపేతం చేయాలని తాను చూస్తుంటే తనకు అధిష్టానం మద్దతు ఇవ్వకపోగా, తనపైన ఆగ్రహం వ్యక్తం చేయడంతో కన్నా లక్ష్మీనారాయణ అధిష్టానం తీరుపై ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా త్వరలోనే ఏపీ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు వేరొకరికి అప్పగించబోతున్నారనే సమాచారంతో కన్నా పూర్తిగా సైలెంట్ అయినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: