లాక్ డౌన్ పెట్ట‌డం సుల‌భ‌మేన‌ని, కానీ ఎత్తేయ‌డ‌మే చాలా క‌ష్ట‌మ‌ని రాజ‌స్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ అభిప్రాయ‌ప‌డ్డారు. లాక్‌డౌన్‌ను ఎత్తివేయాలా..? లేదంటే  కొన‌సాగించాల‌న్న చ‌ర్చా ఊపందుకున్న వేళా గెహ్ల‌ట్ మాట‌ల‌పై ఇప్పుడు ప్రాధాన్యం నెల‌కొంది. శ‌నివారం ఆయ‌న‌ జాతీయ మీడియాతో మాట్లాడారు. లాక్ డౌన్ ఎత్తేయ‌డం అంత సులువు కాద‌ని అన్నారు. క‌రోనా వైర‌స్ వ్యాప్తిని నియంత్రించేందుకు  లాక్ డౌన్‌ను తొల‌గించాలంటే కేంద్ర ప్ర‌భుత్వం చాలా విష‌యాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల్సి ఉంటుంద‌ని అన్నారు. అలాగే వివిధ రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి ఒక్కోర‌కంగా ఉండ‌టాన్ని ఆయ‌న గుర్తు చేశారు. 

 

రాష్ట్రాల మ‌ధ్య అంత‌రం విధించి కొంత మేర స‌డ‌లింపు ఇవ్వ‌డానికి ఆస్కారం ఉంద‌న్న అభిప్రాయాన్ని ఆయ‌న వ్య‌క్తం చేశారు. అయితే  రైళ్లు, విమానాల‌ను అన్ని నిలిచిపోయి ఉన్నాయ‌ని, వాటిని మ‌ళ్లీ మొద‌లుపెడితే ప‌రిస్థితి ఎలా ఉంటుంద‌న్న‌ది ముందే అంచ‌నా వేయాలని చెప్పారు. ప్ర‌జ‌లు ఎలా స్పందిస్తారు? అంద‌రూ సోష‌ల్ డిస్టెన్ పాటించేలా చేసేందుకు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవాల‌న్న‌దానిపై చ‌ర్చ జ‌ర‌గాల‌ని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు సంయుక్తంగా నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉంటుంద‌ని తెలిపారు. ఇదిలా ఉండ‌గా మే 3 త‌ర్వాత లాక్ డౌన్ పొడిగిస్తారా లేదా అన్న‌ది సోమ‌వారం సీఎంల‌తో ప్ర‌ధాని నిర్వ‌హించే వీడియో కాన్ఫ‌రెన్స్ స‌మావేశంలో కొంత స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని చెప్పారు. 


మ‌రోవైపు ఉపాధి లేక‌పోవ‌డంతో వ‌ల‌స కార్మికులు ప‌స్తులుంటున్నారు. వారిని స్వ‌రాష్ట్రాల‌కు త‌ర‌లించాల‌న్న డిమాండ్‌కు దేశ వ్యాప్తంగా మ‌ద్ద‌తు ల‌భిస్తోంది. అయితే స్వ‌రాష్ట్రాల‌కు త‌ర‌లించే ముందు ఎలాంటి జాగ్ర‌త్త‌లు పాటించాల్సి ఉంటుంద‌న్న చ‌ర్చ ఇప్పుడు మొద‌లైంది. వారికి ఆరోగ్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించి హోంక్వారంటైన్‌లో కొన‌సాగేలా ఆదేశిస్తే ఇబ్బందులు ఉండ‌వ‌న్న అభిప్రాయ‌న్ని వైద్యులు వ్య‌క్తం చేస్తున్న‌ట్లు స‌మాచారం.  ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో అధికారాల‌ను వికేంద్రీక‌రించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్న అభిప్రాయం స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మ‌వుతోంది.  శ‌నివారం సాయంత్రం 5 గంట‌ల‌ వ‌ర‌కు దేశ వ్యాప్తంగా 24,942 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: