చిరంజీవి ఇన్స్పిరేషన్ తో నే చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అన్న చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లిన సమయంలో అన్న అడుగుజాడల్లో నడిచారు పవన్ కళ్యాణ్ . అయితే ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా జనసేన అనే పార్టీ ని స్థాపించి రాజకీయాల్లోకి ప్రవేశించారు. అయితే చిరంజీవి ఇలాగే పవన్ కళ్యాణ్ కూడా రాజకీయాల్లో విజయం సాధించలేకపోయారు. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ మాత్రం రాజకీయాల్లో కీలకంగా మారుతు ప్రజల పక్షాన పోరాడుతూనే ఉన్నారు. అయితే తాజాగా గ్రేట్ ఆంధ్ర ఇంటర్వ్యూ కి హాజరైన చిరంజీవి... పవన్ కళ్యాణ్ కు రాజకీయాల్లోకి వెళ్ళినప్పుడు ఏమైనా సలహాలు ఇచ్చారా  అని అడిగిన ప్రశ్నకు ఆసక్తికర సమాధానం చెప్పారు. 

 

 

 నా తమ్ముడు పవన్ కళ్యాణ్ కు  నేను ఎలాంటి సలహాలు ఇవ్వలేదు అంటూ చిరంజీవి చెప్పారు. తన తమ్ముడు పవన్ కళ్యాణ్ తాను ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన సమయంలో తనతో కలిసి ట్రావెల్ చేశాడని... అయితే ఆ సమయంలో నేను ఎదుర్కొన్న ఇబ్బందులు నన్ను మోసం చేసిన మనుషులు, నాకు తగిలిన ఎదురుదెబ్బల  గురించి దగ్గరుండి పవన్ కళ్యాణ్ చూశాడు అంటూ చిరంజీవి తెలిపారు. నేను నమ్మిన వాళ్లు.... నేను చేరదీసిన వాళ్ళు నన్ను ఎలా  దెబ్బతీశారు వెన్నుపోటు పొడిచారు అన్నది పవన్ కళ్యాణ్ కు తెలుసు  అని... అంతేకాకుండా అన్నయ్య అందరితో స్వీట్ గా మాట్లాడి.. అందరినీ నమ్మి నష్టాలు తెచ్చుకున్నాడు అనే ఆలోచన పవన్ కళ్యాణ్ లో ఉంటుంది అంటూ  చిరంజీవి తెలిపారు. అయితే తనకు తగిలిన ఎదురుదెబ్బలు దగ్గర నుంచి చూసిన పవన్ కళ్యాణ్ దాని ద్వారా ఎన్నో నేర్చుకున్నాడు అంటూ చిరంజీవి చెప్పుకొచ్చారు. 

 

 

 అయితే నా దారి నా తమ్ముడు పవన్ కళ్యాణ్ గారి వేరు కావచ్చు కానీ గమ్యం మాత్రం ఒక్కటే అంటూ చిరంజీవి వ్యాఖ్యానించారు. అందుకే తన దారిలోకి నేను వెళ్లి ఏం సలహాలు ఇవ్వలేను అంటూ చెప్పుకొచ్చారు. అందుకే రాజకీయాల విషయంలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కి ఎలాంటి సలహాలు ఇవ్వడం లేదు అంటూ చిరంజీవి క్లారిటీ ఇచ్చారు.  తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ఊర్లోకి వస్తే ఇంటికి వచ్చి అందరినీ కలుస్తారని అంతేకాకుండా మా ఆవిడ వంట అంటే పవన్ కళ్యాణ్ కు ఎంతో ఇష్టం అంటూ చెప్పుకొచ్చాడు చిరంజీవి. పవన్ కళ్యాణ్ మా ఇంటికి వచ్చినప్పుడు పాలిటిక్స్ గురించి మాత్రం ఒక్క ముక్క మాట్లాడమని కేవలం ఫ్యామిలీ గురించి మాత్రమే మాట్లాడుకుంటాము అంటూ తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: