లాక్‌డౌన్ విష‌యంలో కేంద్రాన్ని ఇరుకున‌పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతున్న‌ట్లుగా అర్థ‌మ‌వుతోంది. శ‌నివారం ఆ పార్టీ జాతీయ‌స్థాయి నేత‌లు ముఖ్య‌మంత్రులు జాతీయ మీడియాతో మాట్లాడ‌టం..ట్విట్ట‌ర్‌, ఫేస్‌బుక్ ఇత‌ర సోష‌ల్ మీడియా వేదిక‌ల‌పై నుంచి త‌మ అభిప్రాయాన్ని వెల్ల‌డిస్తున్న‌ట్లుగా ప్ర‌భుత్వం తీసుకుంటున్న‌ది త‌ప్పు అన్న ధోర‌ణితో మాట్లాడ‌టం విశేషం. సుధీర్ఘ కాలం లాక్‌డౌన్ అమ‌లు చేయ‌డం వ‌ల్ల దేశ ప్ర‌జ‌లు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని చెబుతున్న నేత‌లు అదే స‌మయంలో కేంద్ర ప్ర‌భుత్వం అవ‌లంభిస్తున్న విధానాల‌తో ఆర్థిక‌వ్య‌వ‌స్థ ప‌త‌నావ‌స్థ‌కు చేరుకుంటోంద‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం. 

 

వాస్త‌వానికి కాంగ్రెస్ పార్టీ దేశానికి ద్రోహం చేయాల‌నే ఆలోచ‌న‌తో ఏమీ లేదు. కాని అస‌లే రాజ‌కీయంగా దుర్భ‌ర ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటున్న ద‌రిమిలా క‌రోనా నియంత్ర‌ణ వైఫ‌ల్యాల‌ను కాంగ్రెస్‌కు ల‌బ్ధి చేకూర్చేలా చేయ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అందుకే రాహుల్‌, సోనియాగాంధీ, ప్రియాంకాగాంధీతో పాటు ఇత‌ర ముఖ్య‌నేత‌లు కూడా కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్ర‌వేశపెట్టిన మ‌నీ స్కీంల‌ను గుర్తు చేస్తుండ‌టం గ‌మ‌నార్హం. పేద‌ల‌ను ఆదుకోవాల‌నే త‌లంపు మంచిదే. దాన్ని విజ్ఞులు ఎవ‌రూ కాద‌న‌లేరు. అయితే దేశం చాలా క్లిష్ట‌ప‌రిస్థితుల్లో ఉన్న వేళ‌..నిజాయితీగా స‌ల‌హాలు..సూచ‌న‌లు చేయాల్సి ఉంది. మోదీని చాలా దేశాలు ప్ర‌శంసిస్తూంటే ఒక్క కాంగ్రెస్ మాత్రం విమ‌ర్శిస్తోంది.

 

రాజ‌కీయ వైరుధ్యం ఉండ‌టంతోనే ఇలా చేస్తుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. చిన్న వ్యాపారాలు దెబ్బ‌తింటున్న నేప‌థ్యంలో లాక్‌డౌన్‌ను ద‌శ‌ల‌వారీగా ఎత్తివేయాల‌ని ప్ర‌ధాన‌మంత్రి ఒక నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లుగా అర్థ‌మ‌వుతోంది. శుక్ర‌వారం అర్ధ‌రాత్రి నుంచి క‌రోనా కేసులు ఎంత‌మాత్రం న‌మోదుకాని ప్రాంతాల్లో స‌డ‌లింపులు ఇవ్వ‌డమే అందుకు సంకేతంగా రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. గ‌త నెల‌రోజుల కాలంలో ఒక్క కేసు కూడా న‌మోదుకాని ప్రాంతాల‌ను గ్రీన్ జోన్లుగా ప్ర‌క‌టించి పూర్తిగా స‌డ‌లింపు ఇవ్వ‌డానికి కేంద్రం యోచిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. మే 3 ప్ర‌క‌ట‌న వెలువ‌డే అవ‌కాశం ఉంద‌ని ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాలు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్న‌ట్లు స‌మాచారం.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: