దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ ప‌త‌న‌మ‌వుతున్న నేప‌థ్యంలో సాధ్య‌మైనంత త్వ‌ర‌గా లాక్‌డౌన్‌పై కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకోవాల‌ని కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ నేత క‌పిల్ సిబ‌ల్ సూచించారు. శ‌నివారం ఆయ‌న జాతీయ మీడియాతో మాట్లాడారు. ఒకవైపు ప్రజల లాక్‌డౌన్‌.. మరోవైపు ఆర్థిక వ్యవస్థ లాకౌట్‌ ఉండకూడదని అభిప్రాయపడ్డారు. కేంద్ర‌ప్ర‌భుత్వానికి కాంగ్రెస్ మంచి స‌ల‌హాలే ఇస్తోంద‌ని, వాటిని స్వీక‌రించ‌కూడ‌ద‌నే నియ‌మం పెట్టుకోకూడ‌ద‌ని బీజేపీ ప్ర‌జాప్ర‌తినిధుల‌కు చుర‌క‌లంటించారు. క‌రోనా వైర‌స్ వ్యాప్తితో దేశం అత‌లాకుత‌లం అవుతోంద‌ని అన్నారు. రాజ‌కీయాల‌కు ఎలాంటి ఆస్కారం లేకుండా కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్ర‌భుత్వానికి స‌హ‌క‌రిస్తోంద‌ని అన్నారు.


అయితే లాక్‌డౌన్‌ విధించేముందు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలతో ఎందుకు సంప్రదించలేదని ఆయ‌న‌ ప్రశ్నించారు. పెద్దనోట్ల రద్దు మాదిరిగానే ఈ నిర్ణయం ఏకపక్షంగా తీసుకుంద‌ని కేంద్ర ప్ర‌భుత్వాన్ని త‌ప్పుబ‌ట్టారు. రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు ముంద‌స్తుగా నిర్ణ‌యాన్ని తెలిపి ఉంటే ఇంకా మంచి ఫ‌లితాలు ఉండేవ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. లాక్‌డౌన్‌ కారణంగా ప్రజలు రోడ్లమీద నిల్చోవాల్సిన ప‌రిస్థితి చాలా వ‌ర‌కు త‌గ్గేద‌ని అన్నారు. ఇక పేద‌ల‌ను, వ‌ల‌స కార్మికుల‌ను కేంద్ర ప్ర‌భుత్వం ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేద‌ని అన్నారు. కంటితుడుపు చ‌ర్య‌లు ఎంత‌మాత్రం వారిని ఆదుకోలేవ‌ని సిబ‌ల్ స్ప‌ష్టం చేశారు.


ఇక ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు డీఏలను నిలిపివేయడాన్ని కూడా ఆయ‌న త‌ప్పుబ‌ట్టారు. ప్రస్తుత తరుణంలో అందరికీ డబ్బు చాలా అవసరమని అన్నారు. మరోవైపు వచ్చేవారంతో లాక్‌డౌన్‌ ముగుస్తుండటంతో ప్రధాని నరేంద్ర మోదీ.. రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సోమవారం మరోసారి సమావేశం కానున్నారు.ఇదిలా ఉండ‌గా లాక్‌డౌన్ విష‌యంలో కేంద్రాన్ని ఇరుకున‌పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతున్న‌ట్లుగా అర్థ‌మ‌వుతోంది. శ‌నివారం ఆ పార్టీ జాతీయ‌స్థాయి నేత‌లు ముఖ్య‌మంత్రులు జాతీయ మీడియాతో మాట్లాడ‌టం..ట్విట్ట‌ర్‌, ఫేస్‌బుక్ ఇత‌ర సోష‌ల్ మీడియా వేదిక‌ల‌పై నుంచి త‌మ అభిప్రాయాన్ని వెల్ల‌డిస్తున్న‌ట్లుగా ప్ర‌భుత్వం తీసుకుంటున్న‌ది త‌ప్పు అన్న ధోర‌ణితో మాట్లాడ‌టం విశేషం.


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: