ప్రపంచ దేశాలను వణికిస్తున్న మహమ్మారి కరోనా వైరస్ ని ఎదుర్కోవడం కోసం ప్రభుత్వాలు నానా తిప్పలు పడుతున్నాయి. చైనా దేశంలో పుట్టిన ఈ వైరస్ దాదాపు 200 దేశాలకు పైగా విస్తరించి ఉంది. కొన్ని లక్షల మంది శరీరాలలో సోకిన ఈ వైరస్, కొన్ని వేల మందిని బలి తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ వైరస్ అరవై వయసు దాటిన వాళ్లపై ప్రమాదకరంగా ప్రభావం చూపుతోంది. ఇలాంటి టైమ్ లో 100 సంవత్సరాల వయసు కలిగిన ఒక మహానుభావుడు లాంటి ముసలాయన కరోనా వైరస్ వల్ల అవస్థలు పడుతున్న వారి కోసం విరాళాలు సేకరించడానికి పాదయాత్ర స్టార్ట్ చేశారు. పూర్తి మేటర్ లోకి వెళ్తేబ్రిటన్ దేశానికి చెందిన మాజీ సైనిక ఉద్యోగి కెప్టెన్ టామ్ మూరే ఇటీవల 100వ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది.

 

ఈ నేపథ్యంలో బ్రిటన్ దేశం లో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో వాళ్లందరినీ కాపాడటం కోసం వాళ్ల కుటుంబాలను ఆదుకోవటం కోసం  ఆ దేశం స్థాపించిన నేషనల్ హెల్త్ సర్వీస్ ఛారిటీ కోసం విరాళాలు సేకరించాలని డిసైడ్ అయ్యారు మూరే. ఈ సందర్భంగా  వాకింగ్ ఫ్రేమ్ ను ఉపయోగించి 25 మీటర్లు ఉండే తన ఇంటి గార్డెన్ చుట్టూ రోజుకు పది రౌండ్లుచొప్పున.. వంద రౌండ్లు నడవాలని నిర్ణయించారు.

 

ఇందులో భాగంగా "టామ్ స్100 పుట్టినరోజు NHS కొరకు"  అనే నినాదం పేరుతో వెయ్యి పౌండ్ల విరాళాల్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అటువంటి వయసులో కూడా దేశ ప్రజల కోసం ఆయన చేస్తున్న పనికి కేవలం 24 గంటల వ్యవధిలోనే  తన లక్ష్యాన్ని సాధించారు. కొద్ది గంటల్లోనే 28 మిలియన్ల పౌండ్ల విరాళాలను సేకరించి అందరికీ షాక్ ఇచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: