టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా ప్రతిరోజూ సీఎం జగన్ పై ఏదోరకంగా విమర్శలు చేస్తూనే ఉంటారు. కరోనా ప్రభావం మొదలయిన దగ్గర నుంచి ఆయన రోజూ మీడియా సమావేశం పెట్టడం జగన్ పై విమర్శలు చేయడం చేస్తున్నారు. కరోనా వ్యాప్తి అరికట్టడంలో జగన్ విఫలమయ్యారని, కరోనా వ్యాప్తికి వైసీపీ నేతలే కారణమని తన నోటికొచ్చిన విధంగా విమర్శలు చేస్తుంటారు.

 

అలాగే ఏ టీడీపీ నేత చేయని విమర్శ ఒకటి ఉమా చేస్తుంటారు. జగన్ ప్రజా సమస్యలు గాలికొదిలేసి పబ్ జీ గేమ్ ఆడుతున్నారని మాట్లాడతారు. తాజాగా కూడా ఈయన ఇదే  విమర్శ చేసారు. దీంతో వైసీపీ కార్యకర్తలకు మండి, ఉమాపై రివర్స్ ఎటాక్ చేస్తున్నారు. జగన్ పబ్ జీ ఆడుతున్నారని మీకు ఎవరైనా చెవిలో చెప్పారా, ఆయన రోజూ ఏం చేస్తున్నారో కనబడటం లేదా? అని ప్రశ్నిస్తున్నారు. కరోనా వ్యాప్తి కట్టడికి కృషి చేస్తూనే, మరోవైపు ప్రజలని ఆదుకునే ప్రయత్నం చేస్తుంటే, మీరు ఎలా గుడ్డిగా విమర్శలు చేస్తారని అడుగుతున్నారు.

 

అయితే లాక్ డౌన్ వల్ల తాము ఫుల్ ఖాళీగా ఉన్నామని,ఉమాకు అంత సరదాగా ఉంటే. తమతో పబ్ జీ గేమ్ ఆడాలని వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇంకా ఉమా,  ఎంపీ విజయసాయిరెడ్డి అచ్చోసిన ఆంబోతులా తిరుగుతున్నారని మాట్లాడటంపై కూడా కార్యకర్తలు మండిపడుతున్నారు. ఓడిపోయిన దగ్గర నుంచి ఎవరు అచ్చోసిన ఆంబోతులా తిరుగుతున్నారో తెలుసని అంటున్నారు.

 

అయినా విజయసాయి రెడ్డి ఉత్తరాంధ్ర ప్రజలకు అండగా ఉంటున్నారని, ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు నిత్యావసర వస్తువులు, కూరగాయలు, మాస్కులు లాంటివి అందిస్తున్నారని, ఇంకా ప్రభుత్వానికి అండగా ఉండేందుకు విరాళాలు కూడా సేకరిస్తున్నారని చెబుతున్నారు. సామజిక దూరం పాటిస్తూ, పలు జాగ్రత్తలు తీసుకుంటూ విజయసాయి రెడ్డి పర్యటనలు జరుగుతున్నాయని, ఆ విషయాన్ని గమనించకుండా ఉమా గుడ్డిగా విమర్శలు చేయడం తగదని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: