కరోనా వైరస్ తీవ్రస్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యాప్తి చెందుతోంది. ఎవ్వరూ ఊహించని విధంగా వైరస్ ప్రభావం తెలంగాణలో కంటే ఏపీలో చాలా ప్రమాదకరంగా మారింది. ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపడుతున్న గాని వైరస్ కంట్రోల్ అవటం లేదు. వైయస్ జగన్ ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు అధికారులకు నిర్వహిస్తూ రాష్ట్రంలో వైద్య సదుపాయం ఎక్కడా కొరత లేకుండా చూసుకుంటున్నారు. ఒకపక్క కరోనా తో పోరాడుతూనే మరోపక్క ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఆర్థికంగా ఎంత నష్టం ఉన్న పేదవాడికి ఇచ్చిన మాట తప్పి పోకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.

 

ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పేదలకు ఇళ్ళ పట్టాలు ఇవ్వాలని జగన్ ఎప్పటినుండో డిసైడ్ అవ్వడం జరిగింది. రాష్ట్రంలో ఇల్లులేని పేదవాళ్లు ఉండకూడదు అని పాదయాత్రలో మరియు ఎన్నికల ప్రచారంలో అధికారంలోకి వచ్చిన వెంటనే పేదలకు ఇల్లు ఇవ్వబోతున్నట్లు హామీని ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన జగన్ దాదాపు రాష్ట్రవ్యాప్తంగా ఇల్లులేని వారు 27 లక్షల మందిని గుర్తించి వాళ్లకు 2020 ఉగాది వేడుక శుభవేళ పేదలందరికీ ఇళ్ళ పట్టాలు ఇస్తామని ఎపుడో డేట్ ఫిక్స్ చేశారు. కానీ మార్చి రెండవ వారం వరకూ సీన్ ఓకేగానే ఉంది.

 

మూడవ వారం రాగానే ఒక్కసారిగా ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల కోడ్ కారణంగా ఇళ్ళ పట్టాల పంపిణీ కుదరదు అంటూ బ్రేక్ వేసేశారు. ఆ తర్వాత కరోనా వైరస్ రావటంతో ఎన్నికలు వాయిదా పడటంతో ఇళ్ల పట్టాల కార్యక్రమం కూడా వాయిదా పడింది. ఇక రెండోసారి అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14 వ తారీకు లాక్ డౌన్ ఎత్తి వేసిన వెంటనే  ఇవ్వాలని జగన్ నిర్ణయించుకున్నారు. కానీ వైరస్ ప్రభావం తగ్గకపోవడంతో మే 3 వరకు కేంద్రం లాక్ డౌన్ పొడిగించడం జరిగింది. అయితే తాజాగా జూలై 8 వ తారీఖున వైయస్సార్ బర్త్ డే సందర్బంగా అంత కుదిరితే ఇస్తానని జగన్ మూడవ ముహూర్తం ఫిక్స్ చేశారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: