భారతదేశంలో  రోజురోజుకు కరొనా  వైరస్ కబళిస్తోంది. దాదాపు 20 రోజుల క్రితమే దేశంలో లాక్ డౌన్  విధించబడింది. అప్పటి నుంచి బస్సులను ఆపేశారు.. రైళ్లు  ఆపేశారు.. విమానాలు ఆపేసారు. ఎక్కడివారు అక్కడ స్ట్రక్ ఐపోయారు. కనీసం గ్రామాల నుంచి కూడా బయటకు రాని పరిస్థితి. దీంతో ఇక్కడి ప్రజలు అక్కడే ఉండిపోయారు. కానీ కరోనా వైరస్ కేసులు మాత్రం రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం భారతదేశంలో పరిస్థితి ఎలా ఉంది అంటే భారతదేశంలో కరోనా కేసులు  లక్ష వరకు వెళ్లకుండా అడ్డుకున్నామని ఆనందపడాలో లేదా లాక్ డౌన్  సమయంలో ఎక్కడ ప్రజలు అక్కడే ఉన్నప్పటికీ కూడా 20 వేల వరకు కరోనా  వైరస్ కేసులు పెరిగిపోయాయి అనే దానికి బాధ పడాలా అర్థం కాని పరిస్థితి నెలకొంది. 

 

 అయితే దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర కిట్లు  చాలా తక్కువగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కrona వైరస్ లక్షణాలు ఉన్న వారికి ముఖ్యంగా పరీక్షలు నిర్వహిస్తున్నారు వైద్యులు. మొన్నటి వరకు ఎవరి నుంచి ఎవరికి కరోనా  వైరస్ సోకింది అనేది స్పష్టంగా తెలిసేది. కానీ ప్రస్తుతం ఎవరు నుండి  ఎవరికి వచ్చింది ఎలా వచ్చింది అనేది కూడా అంతుచిక్కని పరిస్థితి ఉంది. మరో విషయం ఏమిటంటే ప్రస్తుతం కరోనా వైరస్ ఉన్నప్పటికీ కూడా వారిలో ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదు. మొదట్లో ఏడు రోజుల వ్యవధిలో కరోనా  వైరస్ లక్షణాలు బయట పడ్డాయి. ఆ తర్వాత 14 రోజుల వ్యవధిలో వ్యాధి లక్షణాలు బయట పడ్డాయి కానీ ప్రస్తుతం 28 రోజులు పూర్తయినప్పటికీ కూడా karona వైరస్ రక్షణ ఒక్కటి కూడా బయట పడడం లేదు. 

 


 దీంతో అటు డాక్టర్లు కూడా కరోనా  వైరస్ బారిన పడ లేదు అని ఎలాంటి టెస్టులు చేయడం లేదు. దీంతో ఈ ఇరవై ఎనిమిది రోజుల వ్యవధిలో అతను తిరిగిన ప్రదేశాలు కారణంగా కలిసిన మనుషుల కారణంగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం అసెంప్టా మాటిక్ కేసులే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను భయపెడుతున్నాయి. అసలు లక్షణాలు కనిపించకపోతే ఆ వ్యక్తికి కరోనా వైరస్ సోకింది అని ముందుగా గుర్తించడం ఎలా అనే దానిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కసరత్తులు చేస్తున్నాయి. దీనిపై మళ్లీ కొత్త పరిశోధనలు కూడా మొదలు కానున్నాయి. అయితే కరోనా  ఈ కొత్త రూపాన్ని కేంద్రం ఎలా  ఎదుర్కోబోతున్నది మాత్రం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: