దేశవ్యాప్తంగా కరోనా  వైరస్ రోజురోజుకు విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ ను కట్టడి చేయడంలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర కసరత్తులు చేస్తున్నాయి. అయితే రోజురోజుకు కరోనా వైరస్  బాధితుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అటు ఎప్పటికప్పుడు కరోనా  రోగులకు మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సన్నద్ధ మవుతున్నాయి. ఇక ప్రస్తుతం భారతదేశంలో మలేరియా మందైనా హైడ్రోక్సీక్లోరోక్విన్  మందులు ఉపయోగిస్తున్నారు. చాలామంది కరోనా వైరస్ బారిన పడినవారు కరోనా  వైరస్ నుంచి బయటపడగలుగుతారు. 

 


 ఈ నేపథ్యంలో నమోదవుతున్న కొన్ని కేసులు  మాత్రం డాక్టర్లను అయోమయానికి గురిచేస్తున్నాయి. కొంత మందిలో కనీసం కరోనా  వైరస్ లక్షణాలు కూడా కనిపించడం లేదు. కొంతమందిలో కరోనా  వైరస్ ఎన్నో రోజుల పాటు ఉంటుంది. దీంతో వైరస్ గురించి శాస్త్రవేత్తలు అంతు  చిక్కడం లేదు. విశాఖపట్నంలో ఇలాంటి ఒక కేసు ప్రస్తుతం వైద్యులను  సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆ వ్యక్తికి అసలు కరోనా  వైరస్ లక్షణాలు లేవు. కానీ పరీక్షల్లో మాత్రం పాజిటివ్ వచ్చింది.. మరోసారి నిర్ధారించుకునేందుకు డాక్టర్లు మరో రెండుసార్లు పరీక్షలు నిర్వహించిన పాజిటివ్ అని వచ్చింది. అయితే గత 22 రోజుల నుండి అతని బాడీ లో వైరస్ అలాగే ఉంది. అయితే అందరూ 14 రోజుల వ్యవధిలోనే కరోనా  వయసు నుంచి కోలుకుంటున్నారు. 

 

 దీంతో వైద్యులు కాస్త తర్జనభర్జన పడుతున్నారు. చాలా తక్కువ మంది బాడీ లో వైరస్ ఇన్ని రోజుల పాటు ఉంటుందని.. సదరు రోగి  ఎంతో ఆరోగ్యంగా ఉన్నాడని అందువల్లే కరోనా వైరస్  తట్టుకోగలుగుతుంది అంటూ చెప్పుకొచ్చారు వైద్యులు. కేరళ లో  కూడా ఓ మహిళ కరోనా  వైరస్ బారినపడి 42 రోజులుగా చికిత్స పొందుతోంది. కానీ ఆమెలో  ఇప్పటి వరకు ఏ ఒక్క కరోనా  లక్షణం కూడా కనిపించలేదు. ఇటలీ నుండి వచ్చిన  కుటుంబ సభ్యుల ద్వారా ఆమె కరోనా భారిన  పడింది. కాగా కరోనా లో ఇలాంటి కొత్త రూపం కనిపించడంతో అక్కడ డాక్టర్లు కూడా భయంతో వణికిపోతున్నారు. మామూలుగా లక్షణాలు ఉంటేనే రోగులను గుర్తించడం కష్టం ఎలాంటి  లక్షణాలు లేకుండా ఉంటే ఈ కరోనా  వైరస్ మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉంది అని తర్జనభర్జన పడుతున్నారు వైద్యులు.

మరింత సమాచారం తెలుసుకోండి: