టీవీ ఛానళ్లలో అరగంట యాడ్లు చూసే ఉంటారు. ఈ ఫేస్ క్రీమ్ వాడగానే తన రంగు మారిందని.. ఈ ఉంగరం ధరించగానే తన లైఫ్ మారిపోయిందని చెప్పే యాడ్లు ఉంటాయి కదా. మరి అలాంటి ఓ యాడ్ కరోనాపై రూపొందిస్తే ఎలా ఉంటుందన్న ఊహకు అక్షర రూపం ఇది. ఇండస్ మార్టిన్ ఫేస్‌ బుక్‌ లో రాసుకున్న ఈ పేరడీ మిమ్మల్ని తెగ నవ్విస్తుంది.. 
--------------------- 


మిత్రులారా ఇది నన్ను చాలా సంబ్రమాశ్చర్యాలకు గురిచేసే మార్పు...... నేను గతంలో .. ఎంతో ... మరి కష్టపడి రాత్రనా పగలనకా బ్యాంకాకూ, పటాయా తిరుగుతూ వుండేవాడిని. 


నగరమునకు వచ్చినప్పుడు కూడా వారాంతాల్లో ఎంతో దీక్షతో స్నేహితులతో రాత్రిసమ్మేళనాలలో. పానశాలల్లో గడుపుతూ వుండే వాడిని. ఒక్కోసారి నేను నా భార్యను కూడా అనుకోకుండా ఏదో ఒక విందులోనో వినోదంలోనో కలుస్తూ విపరీతమైన పని వత్తిడిలో వుండేవాడిని. 


దానివలన నాలో ఎంతో అపరాధభావమూ, కట్టుకున్న గృహంలో వుండలేకపోతున్నాననే బాధ వుండేవి. ఇప్పుడు నా జీవితం మారిపోయింది. నేనూ, నా భార్యా, నా పిల్లలూ అందరం ఒకే ఇంట్లో వుంటున్నాం. నా భార్య అందరిలానే పప్పుచారూ, సల్లపిరపకాయలూ, పచ్చిపులుసూ, సర్వప్పం చేస్తుంది. నేను అరలోనుండి  కంచములను తీసుకొచ్చి భోజనబల్ల  మీద పెడుతున్నాను. నా పిల్లలు కూడా ఎంతో ఉత్సాహంతో పెట్టిన భోజనం అంతా తిని తమ మూతి తామే కడుక్కుంటున్నారు. 

 


నేనిప్పుడు ఒక సాధారణ భర్తలా రాత్రికి మా ఆవిడతో ఒకే గదిలో పడుకోగలుగుతున్నాను, పొద్దున్నే చట్నీలో వుప్పు తక్కువ అయ్యిందని తనను అలవోకగా నాలుగు దెబ్బలు వెయ్యగలుగుతున్నాను. తను నాలో పొంగి పొర్లుతున్న సాధారణ భర్త లక్షణాలను చూసి ఆనందభాష్పాలు రాల్చుతుంది.  ఇప్పుడు నా జీవితం పరిపూర్ణంగా మార్పు చెందింది. నేను ఎంతో ఉత్సాహంగా, సంతోషభరితంగా, ఆనందమయంగా వున్నాను. నేను కరోనాకు ఎంతో ఋణపడి వున్నాను. అందరూ బిగ్గరగా కరతాళ ధ్వనులు చెయ్యండి! 
#సెలెబ్రిటీలకు అంకితం

- ఇండస్ మార్టిన్ 

మరింత సమాచారం తెలుసుకోండి: