ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికి  ఎక్కువగా వృద్ధులే  బలైవుతున్నారు. 60 ఏళ్ళు పై బడిన వారికి ఎక్కువగా కరోనా సోకుతుండగా వారిలో రోగ నిరోధక శక్తి  ఆశించిన స్థాయిలో లేకపోవడంతో కరోనా మరణాల్లో ఎక్కువగా వృద్ధులే వుంటున్నారు. అయితే  కేరళ లో మాత్రం 84 సంవత్సరాల వయసు గల వ్యక్తికి  కరోనా సోకగా  దాని నుండి పూర్తిగా కోలుకొని  నిన్న  హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యాడని  కేరళ సీఎం పినరయి విజయన్ వెల్లడించారు. ఇక నిన్న కేరళ వ్యాప్తంగా 7 కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 457కి చేరింది. అందులో 338 మంది కోలుకోగా  ప్రస్తుతం 116 కేసులు యాక్టీవ్ గా ఉన్నాయి. ఇప్పటివరకు ముగ్గురు కరోనా వల్ల మరణించారు. ఇక కరోనా ప్రభావం తగ్గడం తో కేరళలో లాక్ డౌన్ విషయంలో కేంద్రం ఇచ్చిన సడలింపులను అమలు పరుస్తున్నారు. 
అయితే దేశంలో రోజు రోజుకి కరోనా కేసులు పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తుంది. లాక్ డౌన్ గడువు కూడా మరో వారం లో ముగియనుంది. కాగా మరో సారి లాక్ డౌన్ ను పొడిగించే యోచన కేంద్రానికి లేనట్లే కనిపిస్తుంది. ఒకవేళ పెంచినా కూడా మరిన్ని సడలింపులు ఇవ్వాలని భావిస్తుంది. ఈనెల 27న లాక్ డౌన్ విషయంలో క్లారిటీ వచ్చే అవకాశాలు వున్నాయి. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 26000కుపైగా కరోనా కేసులు నమోదుకాగా అందులో 770కిపైగా మరణాలు సంభవించాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: