భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఒక్క నిర్ణయం తీసుకున్నా దానికి సంబంధించి అందరికన్నా ముందు ప్రతిఘటన ఎదురయ్యేది దేశంలోనే టాప్ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే నుండి. దేశంలో భారతీయ జనతా పార్టీ బలంగా ఉన్న రాష్ట్రాల్లో వారి ప్రత్యర్థులు తరపున పని చేసి వారికి దగ్గరుండి విజయాన్ని అందిస్తున్న ప్రశాంత్ కిషోర్ పై ఇప్పటికే మోడీ-షా ద్వయం ప్రతీకార చర్యలు మొదలు పెట్టారు అన్నది జగమెరిగిన సత్యం. అందులో భాగంగా ఇప్పటికే అతనిని జేడీయూ నుండి సాగనంపారు.

 

మరి ప్రశాంత్ కిషోర్ ఏమన్నా ఊరుకుంటాడా...? వెళ్లి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తో కలిసి మోడీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ రాబోయే ఎన్నికల్లో ఆమెను గెలిపించే పనిలో బిజీగా ఉన్నాడు. ఇలా తమ పార్టీకి కొరకరాని కొయ్యగా తయారైన పీకే ఉన్నట్టుండి ఒక్కసారిగా మోడీ చేతికి చిక్కాడు. ఢిల్లీలో మధ్యే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని కేజ్రీవాల్ చిత్తు చేయడంలో కీలక పాత్ర పోషించిన ప్రశాంత్ కిషోర్ లాక్ డౌన్ సందర్భంగా విధించిన నిబంధనలను ఉల్లంఘించారని వార్తలు వచ్చాయి.

 

వివరాల్లోకి వెళితే లాక్ డౌన్ వేల దేశంలో విమాన ప్రయాణాలు నిషేధం అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఢిల్లీ నుండి బయలుదేరిన మూడు కార్గో విమానాలు దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లగా వాటిలో ఒక దాంట్లో ప్రశాంత్ కిషోర్ ప్రయాణించాడని వార్తలు వచ్చాయి. బిజెపి తనపై చేస్తున్న ఆరోపణలకు కౌంటర్ ఇచ్చేందుకు తనకు సహాయంగా కోల్ కతా కు రావాలని మమతా బెనర్జీ కోరడంతో ప్రశాంత్ విమానంలో బయలుదేరినట్లు వార్తలు గుప్పుమన్నాయి.

 

ఇక ఇంత జరిగాక మోడీ ఊరుకుంటాడా..? ప్రశాంత్ కిషోర్ దొరికాడని వెంటనే దీనిపై దర్యాప్తునకు ఆదేశించారు. పీకే ప్రయాణంపై ఢిల్లీ కోల్ కతా విమానాశ్రయాల్లోని సీసీటీవీ ఫుటేజీని అధికారులు పరిశీలిస్తున్నారు. విమానయాన శాఖ దర్యాప్తుచేస్తోంది. మమతను బెంగాల్ లో గెలిపించేందుకు తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా పీకే ప్రస్తుతం ఉన్నారుదీంతో పీకేను బుక్ చేయడానికి కేంద్రంలోని బీజేపీ రెడీ అయ్యింది. ఏం రాజకీయం గురూ…!

మరింత సమాచారం తెలుసుకోండి: