భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా కోట్ల సంఖ్యలో అభిమానులను సొంతం చేసుకున్న పూసర్ల వెంకట సింధు 1995 సంవత్సరం జులై 5వ తేదీన పి రమణ, పి వి విజయ దంపతులకు హైదరాబాద్ లో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ వాలీబాల్ క్రీడాకారులు, తల్లిదండ్రులు వాలీబాల్ క్రీడాకారులైనా ఆమె మాత్రం పుల్లెల గోపీచంద్ స్పూర్తితో బ్యాడ్మింటన్ ను ఎంచుకుని ఎనిమిదేళ్ల వయస్సు నుంచే బ్యాడ్మింటన్ ఆడటం ప్రారంభించారు.

 

IHG

 

అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య 2012 సంవత్సరం ప్రకటించిన ర్యాంకింగ్స్ లో టాప్ 20 జాబితాలో చోటు దక్కడంతో ఆమెకు అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. 2013 సంవత్సరం చైనాలో జరిగిన ప్రపంచ చాంపియన్ షిప్ లో పథకం సాధించి సింధు అలా గెలిచిన తొలి భారతీయురాలిగా రికార్డు సృష్టించారు. భారత ప్రభుత్వం మార్చి 30 2015న సింధును పద్మశ్రీతో సత్కరించింది.

 

IHG

 

2016 లో జరిగిన రియో ఒలింపిక్స్ లో బ్యాడ్మింటన్ విభాగంలో ఫైనల్ చేరిన తొలి భారతీయ మహిళగా, రజత పథకం సాధించిన తొలి భారతీయ మహిళగా ఆమె గుర్తింపు తెచ్చుకున్నారు. 2019లో జరిగిన ప్రపంచ చాంపియన్ బ్యాడ్మింటన్ షిప్ టోర్నీలో భారత్ కు ఆమె స్వర్ణ పతకం తెచ్చిపెట్టి చరిత్ర సృష్టించారు. అంతకుముందే రెండు కాంస్యాలు, రెండు రజతాలు సొంతం చేసుకున్న అమె ప్రపంచ చాంపియన్ షిప్ లో భారత్ కు స్వర్ణం తెచ్చారు.

 

IHG

 

ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో స్వర్ణం సాధించి దేశం గర్వించే విజయాన్ని పీవీ సింధు సాధించారు. సింధు ఇటీవల మీడియాతో మాట్లాడుతూ 2019 ప్రపంచ చాంపియన్ షిప్ కు ముందు తనపై చాలా ఒత్తిడి ఉండేదని.... అంతకుముందు రెండు పర్యాయాలు ఫైనల్ చేరినా సెకండ్ ప్లేసుతో సరిపెట్టుకోవాల్సి వచ్చిందని చెప్పారు. దాంతో ప్రజలు తనను సిల్వర్ సింధు అనడం మొదలుపెట్టారని.... ఫైనల్లో సిల్వర్ సింధు అనిపించుకోవడం ఇష్టం లేక సర్వశక్తులూ ఒడ్డి టైటిల్ చేజిక్కించుకున్నానని పీవీ సింధు చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: