కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. అయితే ఇండియాలో దాని జోరు మిగిలిన దేశాలతో పోలిస్తే కాస్త తక్కువే. అందులోనూ ఇండియాలో వేసవి అప్పుడే అదరొగట్టేస్తోంది. ఇక ఇంతటి ఉష్ణోగ్రతలో కరోనా వ్యాపించడం కాస్త కష్టమే అన్న అభిప్రాయం శాస్త్రవేత్తల్లో ఉంది. జనం కూడా అదే భరోసాతో ఉన్నారు. ఇక కరోనా జోరు తగ్గుతుందని ఆశిస్తున్నారు. కానీ తాజాగా వెలువడిన ఓ పరిశోధన ఫలితాలు చూస్తే గుండెలు అదరడం ఖాయం.

 

 

అదేంటంటే.. కరోనాపై వేసవి ఎలాంటి ప్రభావమూ చూపదబోదట. అంతే కాదు.. మండుటెండల్లోనూ కరోనా తీవ్రస్థాయిలో విజృంభించే అవకాశం ఉందట. ఫ్రాన్స్‌లోని ఎయిక్స్‌-మార్సిల్లె యూనివర్సిటీకి చెందిన సైంటిస్టులు రెమి ఛారెల్‌, బోరిస్‌ పాస్టోరినో ఈ పరిశోధన చేశారు. దీనిలో తేలిన మరో భయంకరమైన వాస్తవం ఏంటంటే.. 197.6 డిగ్రీల ఫారెన్‌హీట్‌ ఉష్ణోగ్రతలో, 212 డిగ్రీల ఫారెన్‌హీట్‌ వేడి నీటిలో కూడా కరోనా బతుకుతుందట.

 

 

అంత ఉష్ణోగ్రతలో 15 నిమిషాల పాటు కంటిన్యూస్ గా ఉంచితేనే కరోనా చనిపోతుదంట. 92 డిగ్రీల సెంటిగ్రేడ్‌ వేడిమిలో 15 నిమిషాల పాటు, 56 డిగ్రీల సెంటిగ్రేడ్‌లో దాదాపు గంటసేపు కరోనా వైరస్‌ను ఉంచినప్పుడే కరోనా చస్తుందట. అంటే సాధారణంగా మన ఇండియాలో వేసవిలో ఉష్ణోగ్రతలు 40- 50 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటాయి. 40 డిగ్రీలు దాటిందంటే జనం ఆపసోపాలు పడుతుంటారు. బాబోయ్ ఎండ అంటారు.

 

 

మరి ఈ పరిశోధన ప్రకారం.. 56 డిగ్రీల ఎండలోనూ కరోనా గంటసేపు బతుకుతుందట. మరి ఆ గంటసేపు సరిపోదా అని వ్యాపించడానికి. కాబట్టి ఎండాకాలం వస్తుంది కదా.. కరోనా పెద్దగా ఇబ్బందిపె‌ట్టదులే అన్న భావన అస్సలు వద్దని సైంటిస్టులు చెబుతున్నారు. తగిన జాగ్రత్తలతోనే ఇంటి నుంచి అడుగు బయటపెట్టడం ఉత్తమమని సూచిస్తున్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: