కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇప్పటి వరకూ దాదాపు 2 లక్షల మందిని పొట్టనపెట్టుకుంది. ఇంకా ఎన్ని మరణాలు సంభవిస్తాయో చెప్పలేం. అయితే కరోనా గురించిన వార్తలు ఒక్కొక్కటి తెలుస్తుంటే గుండెలు అదిరిపోతున్నాయి. ఈ మధ్య కాస్త కరోనా జోరు తగ్గిందని.. కేసుల పెరుగుదల రేటు మందగించిందని వార్తలు వస్తున్నాయి. దీంతో కాస్త జనం ఊపిరిపీల్చుకుంటున్నారు.

 

 

ఎంత కరోనా అయినా ఎంతకాలం ఉంటుందిలే.. మహా అయితే ఇంకో రెండు, మూడు నెలలు అన్న భావన కొందరిలో ఉంది. అయితే కరోనా ఇప్పటి వరకూ చూపించింది చాలా తక్కువేనని మరో అభిప్రాయం వెలువడుతోంది. కరోనా మొదటి ఆరు నెలల్లో కంటే.. రెండో ఆరు నెలల కాలంలో భయంకరంగా తన ప్రభావం చూపుతుందని కొందరు సైంటిస్టులు అంచనా వేస్తున్నారు.

 

 

ఈ అంచనాలకు కారణాలు లేకపోలేదు. గత 250 ఏళ్లలో మొత్తం 10 ఇన్‌ ఫ్లుయంజా వైరస్ రాక్షసులు ప్రపంచాన్ని వణికించాయి. వీటిలో రెండు ఉత్తరార్ధ గోళ శీతాకాలంలో, మూడు వసంతకాలంలో, మరో రెండు వేసవిలో, మరో మూడు శరదృతువులో వచ్చాయట. అయితే కీలకమైన విషయం ఏంటంటే.. ప్రారంభ సమయంలో ఇవి చూపిన ప్రభావం కంటే.. ఆరు నెలల తర్వాత రెండో దశలో ప్రతి ఒక్క వైరస్‌ మానవ జాతికి అపార నష్టాన్ని కలుగజేశాయట.

 

 

ఆ అంచనా ప్రకారం కరోనా ఇప్పటి వరకూ చూపించింది జస్ట్ శాంపిల్ మాత్రేమే అనుకోవచ్చు. అందుకే అప్పుడే కరోనాను లైట్ గా తీసుకుంటే అది పెను ప్రమాదానికి దారి తీసే అవకాశం ఉందని... అమెరికాలోని నేషనల్‌ అకాడమీస్‌ ఆఫ్‌ సైన్స్‌ హెచ్చరిస్తోంది. ఈమేరకు ఆ సంస్థ వైట్‌హౌస్‌కు ఓ నివేదిక ఇచ్చింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: