ప్రస్తుతం బుల్లితెరపై యాంకర్ రష్మీ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జబర్దస్త్ కు వచ్చిన తర్వాత రష్మీ రేంజ్ మొత్తం మారిపోయింది. అప్పటివరకు సినిమాల్లో చిన్నాచితక పాత్రలు చేస్తూ ఎక్కడో చివరి లో కనిపించిన రశ్మి జబర్దస్త్ తర్వాత తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితురాలిగా మారిపోయింది. జబర్దస్త్ లో తనదైన వాక్చాతుర్యంతో... ఆకర్షించే అందం తో.. ఆకట్టుకునే అభినయం తో ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించింది రష్మి. జబర్దస్త్ లో మధ్యలో అనసూయ బ్రేక్ ఇచ్చిన సమయంలో ఛాన్స్ కొట్టేసిన రష్మిక ఆ తర్వాత జబర్దస్త్ లో పాతుకు పోయింది. ఇక జబర్దస్త్ షో రోజు రోజుకు మరింత పాపులారిటీ సంపాదించడంతో రష్మీ  కూడా బాగా పాపులారిటీ పెరిగిపోయింది. 

 

 

 అయితే కేవలం బుల్లితెర పైనే కాదు... వెండి తెర పైన కూడా తన సత్తా చాటుతున్న విషయం తెలిసిందే. ఎన్నో సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ తనదైన అందంతో ఎంతోమంది ప్రేక్షకుల్లో హీట్ పుట్టిస్తోంది బుల్లితెర యాంకర్ రష్మి. జబర్దస్త్ షో లోనే పొట్టి పొట్టి బట్టలతో బుల్లితెర ప్రేక్షకులను ఆకర్షించే ఈ అమ్మడు... ఇక సినిమాలో కూడా హాట్ హాట్ అందాలను ఆరబోస్తూ ఎంతో మంది ప్రేక్షకులను ఆకర్షిస్తోంది. ముఖ్యంగా జబర్దస్త్ లో బాగా పాపులర్ అయిన తర్వాత హీరోయిన్గా గుంటూరు టాకీస్ అనే సినిమా చేసిన  విషయం తెలిసిందే. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. 

 

 

 ఈ సినిమా విజయం సాధించడానికి కేవలం రష్మీ అందాల ఆరబోత కారణం  అనే చెప్పాలి. ఇక ఆ తర్వాత కూడా పలు బోల్డ్  పాత్రల్లో  నటించింది రష్మీ . ఇక జబర్దస్త్ తర్వాత రష్మీ కి వచ్చిన పాత్రలన్నీ బోల్డ్ పాత్రలే అని చెప్పాలి. మీరు కేవలం బోల్డ్  పాత్రల్లో నటిస్తున్నారు ఎందుకు అని అడిగిన ప్రశ్నకు ఆసక్తికర సమాధానం చెప్పింది  రష్మీ . తనకు నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేయాలని ఉంటుందని కాని తన దగ్గరకు బోల్డ్ పాత్రలు మాత్రమే వస్తుంటాయని... అందుకే బోల్డ్ పాత్రల్లో నటించడానికి వెనుకడుగు వేయను  అంటూ తెలిపింది. అంతేకాకుండా గతంలో తాను ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారని అందుకే ప్రస్తుతం ఏ పాత్ర వచ్చినా చేయడానికి సిద్ధంగా ఉంటాను అంటూ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: