చైనాయే క‌రోనా వైర‌స్‌ను త‌యారు చేసింద‌నే అనుమానాల‌ను అమెరికా బ‌లంగా వినిపిస్తూనే ఉంది. అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ ప‌దేప‌దే త‌న అనుమానాల‌ను వ్య‌క్తప‌రుస్తూనే ఉన్నాడు. చైనా చేసిన త‌ప్పుడు ప‌నికి త‌ప్ప‌క శిక్ష ఉంటుంద‌ని ఇప్ప‌టికే ట్రంప్ చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారాన్ని  రేపుతోంది. తాజాగా కరోనా వైర‌స్‌పై ప్రపంచ దేశాలకు వాస్తవాలను వెల్లడించి, చైనాను బోనులో నిలబెట్టేలా వాటిని కలుపుకెళతామని అమెరికా ప్రభుత్వం ప్రకటించ‌డం, వూహాన్‌లోనే తొలుత కరోనా జనించిందనేది సుస్పష్టమని, అది ఎలా మొదలయిందనేది చెప్పాల్సిన బాధ్యత చైనా ప్రభుత్వంపైనే ఉంద‌ని అమెరికా  రక్షణ మంత్రి మైక్‌ పాంపియో ఆరోపించారు.

 

అపారంగా అమెరికా చవిచూసిన ప్రాణ, ఆర్థిక నష్టాలకు కారణమయిన వారు తప్పక ఈ నష్టాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని ప‌రోక్షంగా ఆయ‌న చైనాను హెచ్చ‌రించారు.  వైరస్‌ నుంచి ప్రపంచాన్ని రక్షించడంలో డబ్ల్యూహెచ్‌వో విఫలమయిందని పాంపియో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. . ‘ఈ విపత్కాలంగా సరైన చర్యలు తీసుకోవడంలో దౌత్యపరంగా తక్కినదేశాలకు అమెరికా సహకారం ఉంటుంద‌ని తెలిపారు. చాలా త్వ‌రితంగానే ప్ర‌పంచ దేశాలు ఈ క‌రోనా వైర‌స్ బారిన ప‌డాల‌ని కోరుకుంటున్న‌ట్లు తెలిపారు. ఇందుకోసం ఇప్ప‌టికే వ్యాక్సిన్ త‌యారీలో అమెరికా త‌లమున‌క‌లైన విష‌యాన్ని గుర్తు చేశారు. 


 కరోనా విషయం ఓ టీవీ చాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు.  గత ఏడాది డిసెంబరులోనే తెలిసినా, కనీసం ఒక దేశం వ్యవహరించాల్సిన పద్ధతుల్లోనూ చైనా నడుచుకోలేదని మండిప‌డ్డారు. ప్ర‌పంచ దేశాల‌ను చైనా సంక్షోభంలోకి నెట్టింద‌ని మండిప‌డ్డారు.  అయితే చైనా మాత్రం సైలెంట్‌గా ఉంటోంది. అయితే డ‌బ్ల్యూహెచ్‌వో ప్ర‌తినిధులు మాత్రం చైనా ల్యాబుల్లో వైర‌స్ త‌యారు చేయ‌బ‌డింద‌ని చెప్ప‌డానికి త‌మ ఎలాంటి ప్రాథ‌మిక ఆధారాలు ల‌భించ‌లేద‌ని స్ప‌ష్టం చేశారు. అంతేకాకుండా చైనాపై అన‌వ‌స‌రంగా నింద‌లు వేయ‌డాన్ని మానుకోవాల‌ని ప్ర‌పంచ దేశాల‌కు హిత‌వు ప‌ల‌క‌డం గ‌మ‌నార్హం. 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: