ఈ మధ్య కాలం లో దొంగల బీభత్సం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. పక్క ప్లాన్ తో దొంగతనాలు చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు దొంగలు. అయితే మామూలు వ్యక్తుల ఇంట్లో దొంగతనాలు జరిగితే అది పెద్ద న్యూస్ అవ్వదు గాని.. అదే ఎవరైనా సెలబ్రిటీల ఇంట్లో దొంగతనం జరిగింది అంటే సోషల్ మీడియాలో అదే హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. అలాంటిది భారీ  పాపులారిటీ ఉన్న సెలబ్రేటి  ఇంట్లో దొంగతనం జరిగితే అది ఇంకా బ్రేకింగ్ న్యూస్ గా మారిపోతుంది  అనే విషయం తెలిసిందే. తాజాగా ఇలాంటి ఘటన జరిగింది.  ఇంటర్నేషనల్ లెవల్లో క్రేజ్ వున్న సెలబ్రిటీ ఇంట్లో దొంగతనం జరిగింది. ఇంతకీ ఆ సెలబ్రిటీ ఎవరు అంటారా... భారత స్టార్ బ్యాట్స్మెన్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా. 

 

 

 భారత స్టార్ బ్యాట్స్మెన్ వికెట్ కీపర్ అయిన వృద్ధిమాన్ సాహా ఇంట్లో దొంగలు పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా వృద్ధిమాన్ సాహా మీడియాకు తెలపడం గమనార్హం. పశ్చిమ బెంగాల్లోని సిలిగురి ప్రాంతంలో వృద్ధిమాన్ సాహా కుటుంబం నివాసం ఉంటున్న విషయం తెలిసిందే. తాతల కాలం నుంచి వృద్ధిమాన్ సాహా కుటుంబం అక్కడే నివాసం ఉంటుంది. అయితే అందరూ కలిసి పని నిమిత్తం ముంబయికి వెళ్లారు. ఇదే సమయంలో లాక్‌డౌన్‌ అమలు కావడంతో అక్కడే ఉండిపోవాల్సిన  పరిస్థితి వచ్చింది. ఇక సిలిగురి లో ఉన్న వారి ఇంటికి తాళం వేసి ఉంది. 

 

 

 ఇక లాక్ డౌన్  సమయం ఉండడంతో నెల రోజుల పాటు సిలిగురిలో  ఉన్న వృద్ధిమాన్ సాహా ఇంతకీ ఎవరు వెళ్లలేదు. ఇక మామూలుగానే గంటో రెండు గంటలో బయటకు వెళ్తే ఇల్లును గుళ్ల చేస్తారు దొంగలు. అలాంటివి నెల రోజులకు పైగా ఆ ఇంటి చుట్టుపక్కల ఎవరూ కనిపించకపోవడంతో దొంగలు ఆ ఇంటి పై కన్నేశాడు. తాళాలు పగులగొట్టి లోనికి వెళ్లారు. ఇక ఆ ఇంటికి దగ్గరలోనే వృద్ధిమాన్ సాహా బంధువులు ఉండడంతో వారు నివాసంలోకి చొరబడిన దొంగలను గమనించారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో పాటు... ఇంట్లోకి చొరబడిన దొంగలను పట్టుకున్నారు. ఇక తాము తమ ఇంటికి వెళ్ళక పోవడం తో దొంగలు ఇంట్లో చోరీ చేసే ప్రయత్నం చేశారని కానీ బంధువుల సాయంతో.. తమ ఇంట్లో చోరీ జరగలేదు అంటూ ఇండియన్ స్టార్ క్రికెటర్ వృద్ధిమాన్ సాహా చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: