లాక్‌డౌన్ అమ‌లు కార‌ణంగా దేశ వ్యాప్తంగా చిన్న‌, మ‌ధ్య‌త‌ర‌హా, సూక్ష్మ స్థాయిప‌రిశ్ర‌మ‌లు దారుణంగా దెబ్బ‌తిన్నాయని కాంగ్రెస్ అధ్య‌క్షురాలు సోనియాగాంధీ అభిప్రాయ‌ప‌డ్డారు. ఈ రంగాల‌ను ఆదుకునేందుకు కేంద్ర‌ప్ర‌భుత్వం భారీగా ఉద్దీప‌న చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని సూచించారు. క‌నీసం త‌క్కువ‌లో త‌క్కువ ల‌క్ష‌కోట్ల ప్యాకేజీని ఇందుకు కేటాయించాల‌ని అన్నారు. అప్పుడుగాని ఈ రంగాలు న‌ష్టాల నుంచి ఎంతోకొంత బ‌య‌ట‌ప‌డ‌వ‌ని అన్నారు. ఈ వివ‌రాల‌న్నీ పేర్కొంటూ ఆమె శనివారం ప్రధాని నరేంద్ర మోదీకి బ‌హిరంగ లేఖ రాశారు. ‘ఎంఎస్‌ఎంయీ వేతన పరిరక్షణ’ కింద రూ.లక్ష కోట్ల ప్యాకేజీని ప్రకటించాలని లేఖ‌లో కోరారు.

 

అలాగే అంతే మొత్తంలో రుణ హామీ నిధిని ఏర్పాటు చేయాల‌ని అన్నారు. ఇక రోజంతా సేవలు అందించే హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. లాక్‌డౌన్‌ కారణంగా ఈ రంగాల‌కు  ప్రతి రోజూ కనీసం రూ.30వేల కోట్ల మేర న‌ష్టం వాటిల్లుతోంద‌ని సోనియాగాంధీ పేర్కొన్నారు. ఇదిలా ఉండ‌గా కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు కపిల్‌ సిబల్‌ కూడా వీడియో ద్వారా విలేకరులతో మాట్లాడారు.కరోనా సంక్షోభంపై జాతీయ విధానం రూపొందించాలని ప్రభుత్వానికి సూచించారు. ఇదిలా ఉండ‌గా  ఇక దేశ వ్యాప్తంగా క‌రోనా బారిన ప‌డి మ‌ర‌ణించిన వారి సంఖ్య 824కి చేరింది. ఐతే... ఈ కేసుల్లో 30 శాతం కేసులు ఒక్క మహారాష్ట్రలోనే ఉండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది.

 

 గుజరాత్‌లో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ప్రస్తుతం ఆ రాష్ట్రం ఢిల్లీని వెనక్కి నెట్టి రెండో స్థానానికి చేరుకోవ‌డం గ‌మ‌నార్హం. దేశంలో వేర్వేరు రాష్ట్రాల్లో కరోనా వైరస్ లెక్కలు వ‌రుస‌గా ఇలా ఉన్నాయి. మహారాష్ట్ర 7628, గుజరాత్ 3071, ఢిల్లీ 2615, మధ్యప్రదేశ్ 2096, రాజస్థాన్ 2083, తమిళనాడు 1821, ఉత్తరప్రదేస్ 1793, ఆంధ్రప్రదేశ్ 1061, తెలంగాణ 991, బెంగాల్ 611, కర్ణాటక 500, జమ్మూకాశ్మీర్ 494, కేరళ 457, పంజాబ్ 298, హర్యానా 289, బీహార్ 243, ఒడిశా 94, జార్ఖండ్ 67
ఉత్తరాఖండ్ 48, హిమాచల్ ప్రదేశ్ 40, ఛత్తీస్‌గఢ్ 37, అసోం 36, అండమాన్ నికోబార్ 33, చండీగర్ 28, లఢక్ 20, మేఘాలయ 12, పుదుచ్చేరి 7, గోవా 7, మణిపూర్ 2, త్రిపుర 2, మిజోరం 1, అరుణాచల్ ప్రదేశ్ 1 కేసులు న‌మోదయ్యాయి.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: