నీకు ఆస్తి ఉందన్నది పెద్ద లెక్క కాదు.. నీకు ఎంత దానగుణం ఉందన్నది ఇప్పుడు ఇండియాకు అవసరం. లాక్ డౌన్ సమయంలో కోట్ల మంది ఆకలితో అలటిస్తుంటే.. నీదగ్గర ఉన్న కోట్లు ఎంత మందికి తిండి పెట్టాయన్నది ముఖ్యం.. ఎంత మంది ఆకలి తీర్చావన్నది గొప్పదనం.. దేశంలో కోటీశ్వరులు ఎందరో ఉన్నారు. కానీ కోట్లను చిల్లర రూపాయల్లా పేదల కోసం ఖర్చు చేయగల మనస్సున్న వారు ఎవరు..?

 

 

ఇలాంటి ప్రశ్నలకు నిలువెత్తు మాతృరూప సమాధానం సుధానారాయణమూర్తి.. అవును ఆమె.. 24 లక్షల మందికి ఆహారం అందిస్తోంది. 2.30లక్షల కుటుంబాలకు చేయూత ఇస్తోంది. రోజూ 12.41 లక్షల భోజనాలు పంపిణీ చేస్తోంది. 10వేల మంది దినసరి కూలీలకు రోజూ 1,000 చొప్పున సాయం అందిస్తోంది. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ సుధామూర్తి గొప్పదనం ఇంది.

 

 

ఇలాంటి దానాలు సుధానారాయణ మూర్తికి కొత్త కాదు. పేదప్రజలకు సాయం చేసేందుకు ఎప్పుడూ ముందుంటారు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్‌ పర్సన్ సుధామూర్తి. కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న సమయంలో ఆమె పాతిక లక్షల మందికి ఆహారం అందిస్తున్నారు. ఇన్ఫోసిస్ ఫౌండేషన్‌ ద్వారా దాదాపు 120 కోట్ల రూపాయల విలువైన సాయం అందిస్తున్నారామె.

 

ఏదో డబ్బు చెక్ ద్వారా ఇచ్చేశాం.. చేతులు దులుపుకున్నాం అనే తీరు కాదు సుధానారాయణమూర్తిది. ఆమె అన్నీ దగ్గర ఉండి ఈ సేవా కార్యక్రమాలు పర్యవేక్షిస్తుతన్నారు. బెంగళూరులో ఓ ఆస్పత్రి నిర్మించారు. ప్రధానమంత్రి సహాయనిధి పీఎం కేర్స్‌కు 50 కోట్లు విరాళం ఇచ్చారు. వెంటిలేటర్లు, మల్టీ పారా పేషంట్‌ మానిటర్స్‌, శానిటైజర్లు, పీపీఈ కిట్లు.. ఇలా ఏది అవసరమో అవి సరఫరా చేస్తున్నారు.

దాతృత్వం చాటుకుంటున్నారు సుధానారాయణమూర్తి. ఇలాంటి అమ్మలే ఇండియాకు కావాలిప్పుడు.

మరింత సమాచారం తెలుసుకోండి: