ఏపీ సీఎం జగన్ అర్జంటుగా రాజీనామా చేసేయాలి.. ఏమాత్రం సిగ్గు, లజ్జ, అభిమానం, ఉక్రోశం ఉన్నా వెంటనే కుర్చీ నుంచి దిగిపోవాలి. అదేంటి.. అంత కొంపలు మునిగే అవసరం ఏమొచ్చిందంటారా.. ఇంకా ఏం కావాలి.. ఇప్పటి వరకూ జగన్ సర్కారును తప్పుబడుతూ ఎన్ని కోర్టు తీర్పులు రాలేదు.. ఇప్పటికే 50 సార్లు కోర్టు మొట్టికాయలు వేసింది.. ఇంకా సీఎం సీట్లోనే ఉంటారా.. ఇదీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కడుపు మంట.

 

 

కోర్టుల తీర్పులు శిరోధార్యాలుగా నాయకులు భావిస్తున్నారట. గతంలోనూ ఇలా చాలాసార్లు రాజీనామాలు చేశారట. కావాలంటే చరిత్ర చూసుకోమంటున్నాడు ఆర్కే. అప్పుడెప్పుడోబస్సు రూట్ల జాతీయీకరణ నిర్ణయంపై న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలతో నీలం సంజీవ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అవును కదా.. ఆయనా రెడ్డిగారే. మరి నీలం సంజీవరెడ్డి చేసినప్పుడు జగన్ రెడ్డి ఎందుకు చేయరు.. ఇదీ లాపాయింటే..

 

 

అంతేనా.. ప్రైవేటు వైద్య కళాశాలలకు అనుమతి ఇచ్చిన వ్యవహారంలో హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో నేదురుమల్లి జనార్దన్‌ రెడ్డి సైతం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేశారు. అవును.. మళ్లీ ఈయన గారు కూడా రెడ్డిగారే.. మరి జనార్దన్ రెడ్డి చేసినప్పుడు జగన్ రెడ్డి ఎందుకు చేయరు.. ఇదీ లాపాయింటే.. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఇస్తున్న తీర్పులు, చేస్తున్న వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి రోజూ రాజీనామా చేయాల్సి ఉంటుందట. కానీ.. అందుకు విరుద్థంగా హైకోర్టుతో ఢీకొనడానికే జగన్మోహన్‌ రెడ్డి సిద్థపడుతున్నారట. ఎంత అన్యాయం.. ఎంత దుర్మార్గం..?

 

 

దాదాపు ఏడాది కాలంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను 50కి పైగా సందర్భాలలో హైకోర్టు తప్పుబట్టిందని ఆర్కే గుర్తు చేస్తున్నారు. మరి ఇన్నిసార్లు కోర్టు జగన్ సర్కారును తప్పుబడితే రాజీనామా చేయాల్సిందే అంటున్నారు ఆర్కే. పాపం.. గతంలో చంద్రబాబు సర్కారు ఉన్నప్పుడు కూడా ఇలా కోర్టు అనేకసార్లు మొట్టికాయలు వేసిన సంగతి మాత్రం కన్వీనియంట్ గా మర్చిపోతాడు ఆర్కే. అదేంటో మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: