చాలా మంది శృంగారానికి మాత్రం పెద్ద‌గా ఇంపార్టెన్స్ ఇవ్వ‌రు. కొంద‌రు ఎందుకో తెలియ‌దు కాని పెద్ద‌గా ఇంట్ర‌స్ట్ చూపించ‌రు. ఇక ఆహారం మ‌రియు శృంగారం ఈ రెండిటి పైన ఈ మ‌ధ్య శాస్త్ర‌వేత్త‌లు చేసిన స‌ర్వే ప్ర‌కారం మ‌హిళ‌కు ఎక్కువ‌గా తిండి పైన ఆశ‌క్తిని చూపుతున్నారంట‌. లండన్‌కు చెందిన ఓ అధ్యయన బృందం 950 మంది మహిళలపై సర్వే చేపట్టింది. ఈ సర్వేలో పాల్గొన్న మహిళల్లో సుమారు 70 శాతం ఎక్కువగా తిండి గురించే ఆలోచన చేసినట్లు వెల్లడైంది. వాళ్ళు శృంగారానికి పెద్ద‌గా ప్రాధాన్యం ఇవ్వ‌లేదంట‌. ఇదేవిధంగా వారిలో 58 శాతం మాత్రమే సెక్స్ గురించి ఆలోచన చేసినట్లు తేలింది.

 

వివరాలలోకి వెళితే... మహిళలు ఒక రోజులో సెక్స్ గురించి ఎన్నిసార్లు ఆలోచిస్తారు...? అని జ‌రిపిన స‌ర్వేలో వాళ్ళు  24 గంటల్లో కనీసం పదిసార్లు సెక్స్ సంబంధిత ఆలోచనల్లో ఉంటారని తేలింది. ఇక భోజనం విషయానికి వస్తే సుమారు 15 నుంచి 20 సార్లు తమ దృష్టిని తిండిపైకి మరలిస్తున్నట్లు వెల్లడైంది. అంటే దీన్ని బ‌ట్టి శృంగారం కంటే తిండికే ఎక్కువ ప్రాధాన్య‌త‌నిస్తున్న‌ట్లు వెల్ల‌డ‌వుతుంది. ఎప్పుడు ఏది తినాలా...? అన్న ఆలోచనలో ఎక్కువ శాతం మహిళలు మునిగి ఉన్నట్లు అధ్యయనంలో వెల్లడైంది.

 

దీని వెనుక ఉన్న కారణాలను కూడా వారు శోధించారు. అయితే  మహిళల్లో ఎక్కువమంది ఇంటిపని చేయడం తగ్గిపోయి స్థూలకాయులుగా మారుతున్నారనీ, ఇంటిప‌నంటే చాలు చాలా మంది బ‌ద్ధ‌కాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని  తేలింది.  ఫలితంగా వారిలో సెక్స్ పట్ల విముఖత పెరగుతోందని కనుగొన్నారు. అదే సమయంలో భారీకాయం కావటంతో శరీరానికి వెంటవెంటనే ఆహారం అవసరమవుతోందనీ, ఫలితంగానే వారి ఆలోచనలు ఎక్కువగా తిండి చుట్టూ తిరుగాడుతున్నాయని అధ్యయనకారులు వెల్లడించారు. ఇంటిప‌నుల మీద ఇంట్ర‌స్ట్ పెద్ద‌గా లేనివారు క‌నీసం ఎక్స్‌ర్‌సైజ్‌లాంటివ‌న్నా చెయ్యాలంటున్నారు. దాని వ‌ల్ల శ‌రీరాన్ని కాస్త క‌ష్ట‌పెడితే మ‌న‌లో ఉన్న కొవ్వు మొత్తం చెమ‌ట రూపంలో బ‌య‌ట‌కు వెళుతుంది. ఒక‌ప్పుడు ఆడవారు ఎవ‌రి ఇంటిప‌ని వారు మాత్ర‌మే చేసుకునేవారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: